Eluru Students Sports:కర్నూలులో జరిగిన 9వ సబ్ జూనియర్, జూనియర్స్, రాష్ట్ర స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో ఏలూరు జిల్లాతరపున పాల్గొని బంగారు, రజిత,కాంస్య పతకాలు పొందిన స్విమ్మింగ్ క్రీడాకారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభినందించారు.
ఈ సందర్బాన్ని పురస్కరించుకొని సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,జెసి బి.లావణ్య వేణి లను మర్యాదపూర్వకంగా విజేతలు కలిసారు.
ఈ సందర్బంగా వారికి అభినందనలు తెలుపుతూ భవిష్యత్ లో జాతీయస్ధాయిలో ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించి మరిన్ని పతకాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి కూడా క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
క్రీడాకారుల వెంట డిఎస్ డిఓ బి. శ్రీనివాసరావు, జిల్లా స్విమ్మింగ్ అసోషియేషన్ సెక్రటరీ ఐ. మల్లిఖార్జునరావు తదితరులు ఉన్నారు. సబ్ జూనియర్ విభాగంలో డి. స్వామినాయుడు, స్విమ్మింగ్ లో వివిధ విభాగాల్లో 5 బంగాలు పతకాలను గెలుచుకున్నారు. జూనియర్ విభాగంలో బి. ధనుష్ సాయి రెండు బంగారు పతకాలు గెలుచుకోగా, పి. రఘురాం రెండు కాంస్య పతకాలను, సబ్ జూనియర్ విభాగంలో యండి సిధ్ర మూడు విభాగాల్లో వెండి పతకాలు, ఒక విబాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. సిహెచ్ పూర్ని జూనియర్ విభాగంలో 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో వెండి పతకాన్ని జె. యశస్వినీ 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ లో వెండి పతకాన్ని, పి. శ్రాగ్విత 100 మీటర్ల బటర్ ఫైల్ లో వెండి పతకాన్ని పొందారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in