Employment:ఏలూరు ఆగస్టు 12: యువత సృజనాత్మక ఆలోచనలు పెంపొందించుకొని నూతన ఆవిష్కరణ వైపు అడుగులు వేయాలనిజిల్లా యువజన సంక్షేమ అధికారి మధుభూషణరావు
అన్నారు స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ మరియు జిల్లా యువజన సంక్షేమ శాఖ ఏలూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సెటిల్ సీఈవో మధుభూషణరావు మాట్లాడుతూ విద్యార్థులు నేటి డిజిటల్ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చదువులలో ముందంజలో ఉండాలని అన్నారు కొత్త కొత్త వృత్తి నైపుణ్య కోర్సులను నేర్చుకొని జీవితంలో బాగా స్థిరపడాలని ఆకాంక్షించారు స్ఫూర్తి సంస్థ కార్యదర్శి షేక్ మొహిద్దిన్ భాష మాట్లాడుతూ జీవితంలో ఎదగాలంటే మంచి క్రమశిక్షణ పట్టుదల మరియు స్వీయ క్రమశిక్షణ అలవర్చుకుంటే ఉన్నత స్థానానికి చేరచ్చని ఉద్బోధించారు మానవతా సంస్థ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థులు మంచి విలువలను కలిగి ఉంటేనే మంచి స్థాయికి చేరవచ్చు అని అన్నారు మానవత జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు గారు అధ్యక్షత వహించారు అనంతరం ఉదయం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన డిబేట్ క్విజ్ పోటీలలో విజేతలకు స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ద్వారా మెమొంటోళ్లు సర్టిఫికెట్లు అతిథుల ద్వారా అందజేయబడ్డాయి ఈ కార్యక్రమంలో సెట్ వెల్ మేనేజర్ సత్యనారాయణగారు, కళాశాల కోఆర్డినేటర్ సౌభాగ్య లక్ష్మి , విద్యార్థులు పాల్గొన్నారు
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in