Essentialy Commodities:ఏలూరు, జూలై, 24… నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రణలో ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి అధికారులను ఆదేశించారు. స్ధానిక పత్తేబాద రైతు బజారు, ఏలూరు 2 వ టౌన్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. బహిరంగ మార్కెట్ కంటే బియ్యం, కందిపప్పు, పంచదార వంటి నిత్యావసరమ సరుకులు రైతుబజారులో తక్కువ ధరలకు అందించాలన్నారు. రైతు బజారుల్లో చౌక ధరలతో ప్రజలకు అందుబాటులో ఇచ్చుటకు జిల్లాస్థాయి యంత్రాంగం పనిచేస్తుందని, ఈ అవకాశమును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరియున్నారు. ఇందు విషయమై సరైన చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరా అధికారికి, సిబ్బందికి సూచనలు జారీ చేసినారు.

తదుపరి ధాన్యం కొనుగోలు, కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీలలో (సి.యం.ఆర్) జరిగే విధానంపై వారి కార్యాలయములో సమీక్షా నిర్వహించిన పిదప, దెందులూరు మండలంలోని శ్రీ వెంకటసాయి రైస్ ట్రేడర్స్ తనిఖీ చేసి, రైతు భరోసా కేంద్రముల నుండి తీసుకొన్న ప్రభుత్వ ధాన్యమును, సక్రమముగా మిల్లింగ్ చేసి, నిర్ణిత కాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ సివిల్ సప్లయిస్ వారికి ఇచ్చే విధానం మరియు మిల్లింగ్ చేసే విధానం, మిల్లులో గల సార్టెక్స్ మెషినరీ, బ్లెండింగ్ మెషినరీ, మిల్లు స్టోరేజ్, కెపాసిటీ, గొనె సంచులు అన్ని కూడా స్వయంగా చూసి, జిల్లా పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు మంజు భార్గవి, జిల్లా పౌరసరఫరా అధికారి ఆర్.యస్.యస్. సత్యనారాయణ రాజు, ఇతర సిబ్బందికి తగు సూచనలు చేసి త్వరితగతిన మిల్లింగ్ చేసి సి.యం.ఆర్. డెలివరీ ఇవ్వవలసినదిగా సదరు మిల్లర్ను ఆదేశించారు. ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేయవలెనని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి ఆదేశించారని, ఆర్.యస్.యస్. సత్యనారాయణ రాజు, జిల్లా పౌరసరఫరా అధికారి, ఏలూరు వారు తెలిపియున్నారు.
ఇందు విషయమై ఆర్. యస్. యస్. సత్యనారాయణ రాజు, జిల్లా పౌరసరఫరా అధికారి, ఏలూరు వారు మాట్లాడుతూ జిల్లాలో 26 బియ్యం మరియు కందిపప్పు కౌంటర్లను సరసమైన ధరలకు ప్రజలకు ఇప్పటికే అందుబాటులోనికి తీసుకొని వచ్చియున్నామని, ప్రజలు సద్వినియోగం పరుచుకోవలెనని ధరలు నియంత్రణ కొరకు ప్రభుత్వం నిరంతరంగా పర్యవేక్షణ చేయుచున్నదని మరియు జిల్లాలో 99 రైస్ మిల్లులలో ఇప్పటికే 86 రైస్ మిల్లులు సి.యమ.ఆర్ డెలివరీ ఇచ్చియున్నదని, ఇంకను 13 రైస్ మిల్లులు డెలివరీ ఇవ్వవలసియున్నదని వాటిని మిల్లర్లతో మాట్లాడి త్వరితగతిన పూర్తిచేయుటకు ఏర్పాటు చేసియున్నామని తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in