Execirse:కసరత్తుల తరువాత ఏం తినాలి ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి. మరీ ఎక్ససైజ్ చేశాక తినొచ్చా లేదా ఎంతసేపు ఆగాలి. ఇలా చాలా అనుమానాలు ఉంటాయి.
కొంత మంది డైటింగ్ అని కసరత్తుల తరువాత తినరు. అది సమస్యను ఇంకా పెద్దది చేయగలదు. కాబట్టి
శరీరానికి గ్లూకోజ్ ని ఇంధనం లాంటిది. వ్యాయామం సమయంలో ఇది ఖర్చయిపోతుంది. దీన్ని వృద్ధి చేసుకోవాలన్నా ఎముకల్లోని ప్రోటీన్ పెంపొందించుకోవాలన్న దేహానికి తగినని పోషకాలు కావాలి. అది కూడా వ్యాయామం ముగిసిన 40 నిమిషాల లోపే అలా తినేటప్పుడు ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఫ్యాట్ ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్, అమోనో యాసిడ్లు అందించే శరీరం పుంజుకునేలా చేస్తుంది. అందుకు కనీసం 20-40 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఇది గుడ్లు, పెరుగు, చీజ్, చికెన్ ప్రోటీన్, చేపల్లో, పుష్కలంగా ఉంటుంది.
కార్బోహైడ్రేట్లు కోల్పోయిన గ్లూకోజ్ ను తిరిగి పొందేలా చేస్తాయి. ప్రోటీన్ తో పోలిస్తే ఇది మూడు రేట్లు అధికంగా అవసరం. కనీసం 60- 120 గ్రాములు కావాలి. పాలు, చిలకడదుంప, క్వినోవా, బంగాళదుంప, గోధుమ బ్రెడ్, వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం చేసేదే కొవ్వు తగ్గించుకోవడానికి అయితే మళ్లీ దాన్నే తినమంటున్నారు ఏంటి అనుకోకండి. జీవ క్రియలకు కొవ్వు చాలా అవసరం. తక్కువ మోతాదులో అయిన తప్పక తీసుకోవాలి. శరీరానికి శక్తిని అందించడంలో దీనిది ప్రధాన పాత్ర మంచి కొవ్వును ఇచ్చే అవకాడో, నట్స్, గుమ్మడి, పొద్దు తిరుగుడు విత్తనాలను, తీసుకుంటే సరిపోతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in