Flood:ఏలూరు/వేలేరుపాడు, జులై, 26 : వరద ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని కుటుంబాలకు జిల్లా యంత్రాంగం నిత్యావసర సరుకులు, కాయగూరలను పంపిణీ చేసింది.
జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్.ఎస్.సత్యనారాయణరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాబ్జి, డ్వామా పీడీ పి. రాము, సిబ్బంది కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని తోటకూరగొమ్ము, దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీ, మర్రిపాడు ఆర్ అండ్ ఆర్ కాలనీ, , కౌడిన్యముక్తి , తదితర గ్రామాలలోని ప్రతీ ఇంటింటికి వెళ్లి ప్రతీ కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అర కేజీ వంటనూనె, 5 రకాల కాయగూరలు వరద బాధిత కుటుంబాలకు అందజేశారు. వరద సహాయక చర్యలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటె తమకు తెలియజేయాలని, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు ఆయా గ్రామాల ప్రజలకు తెలియజేసారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in