Free Sewing Machine:ఏలూరు, మార్చి, 7: యాక్షన్ ప్లాన్ -2024-2025 లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు జిల్లా లోని బీసీ, కాపు మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 18-50 సంవత్సరాల మహిళలకు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణానoతరం సర్టిఫికేట్ తో మెషిన్ ను అందచేయు పధకం ను జిల్లా వెనుకబడిన తరగతుల సేవ సహకార సంఘము లిమిటెడ్ ఏలూరు శాఖ, ద్వారా అమలు చేస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం కార్య నిర్వాహక సంచాలకులు యన్. పుష్ప లత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్హులైన లబ్ధిదారుల నుండి సంబంధిత శిక్షణకు గాను ఆన్లైన్ లోఅప్లై చేసుకొనుటకు గాను https://apobmms.apcfss.in/ అను వెబ్సైట్ ద్వారా లబ్ధిదారులు సంబంధిత సచివాలయాల ద్వారా పై తెలిపిన వర్గాలవారు ఆన్లైన్ లోఅప్లై చేకొనవచ్చునన్నారు. ఈ ప్రక్రియను ఈనెల 8వ తేదీ శనివారం నుండి పై తెలిపిన వెబ్సైట్ నందు అందుబాటులో వుండును.
మిగత ప్రక్రియ సంబందిత మండల/ మున్సిపాలిటీ లేదా సంబందిత ట్రైనింగ్ సెంటర్ లో వివిద తేదీలలో కొనసాగును, మరియు దీనిలో భాగంగా ఏలూరు జిల్లాకు బీసీ & ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలకు గాను 4589 మందికి శిక్షణ ఇచ్చుట కొరకు లక్ష్యాన్ని నిర్దేశించటం జరిగిందన్నారు.
మరిన్ని వివరాలకు మా కార్యాలయమునకు ఫోన్ నెంబర్: 08812-230837 ద్వారా సంప్రదించవచ్చన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in