GO : అడ్డగోలు జిఓ లతో సాక్షి మీడియా కి గత ప్రభుత్వం 403 కోట్ల రూపాయలు ప్రకటనల పేరుతో లబ్ది చేకూర్చారని, ఇటువంటి ఆర్ధిక అవకతవకల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో గురువారం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం అడ్డగోలు జి.ఓ ని తీసుకువచ్చి సాక్షి మీడియా కి 403 కోట్ల రూపాయలు, మిగిలిన అన్ని పత్రికలకు కలిపి 488 కోట్ల రూపాయలు ప్రకటనల రూపంలో ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం చేసిన బాధ్యతారాహిత్య పాలన కారణంగా రాష్ట్రం అభివృద్ధిలో మరో 15 సంవత్సరాలు వెనుకపడిపోయిందన్నారు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రాభివృద్ధి గాడిలో పెట్టేందుకు సమర్థుడైన నాయకుడిగా చంద్రబాబునాయుడు ని ప్రజలు గుర్తించి తమ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారన్నారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని బాధ్యతగా భావించి ప్రజా క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజలు తమ భుజస్కందాలపై ఉంచిన బాధ్యతతో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేసిందని, 2. 70 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చుచేశామని చెప్పినప్పటికీ, మిగిలిన 8 లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో జరిగిన ఆర్ధిక అరాచకానికి సంబంధించి సాక్ష్యాలతో సహా ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేశారన్నారు. వాటిల్లో ఏమైనా అబద్దాలు ఉంటె రుజువులతో వచ్చి నిరూపించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని, ఐనప్పటికి రాష్ట్రాభివృద్ధికి సహకరించమని ప్రతిపక్షాన్ని కోరామని, ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుందన్నారు.
65 లక్షల మందికి ప్రతీ నెలా 2712 కోట్ల రూపాయల పెన్షన్ పంపిణీ : రాష్ట్రంలోని 65 లక్షల మందికి ప్రతీ నెల 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా పంపిణీ చేస్తున్నారమన్నారు. గత ప్రభుత్వానికి పేదలకు పెన్షన్ ను 2 వేల నుండి 3 వేల రూపాయలకు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే తమ ప్రభుత్వం 10 రోజుల్లోనే 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచమని, 3 నెలల బకాయిలను కూడా అందించామన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో వాలంటీర్లు మొత్తం ప్రపంచంగా చిత్రీకరించి పెన్షనర్లకు పెన్షన్ అందించకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైనా చేయగలమని రాష్ట్రంలోని ఉద్యోగులు నిరూపించారని, పెన్షనర్లకు ఒక్కరోజులోనే 98 శాతం వరకు పెన్షన్లు అందించారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 4 వేల రూపాయలకు పెంచమని, 16, 700 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించామని, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని, అన్నా కేంటీన్లను ఆగష్టు, 15వ తేదీన ప్రారంబిస్తున్నామన్నారు.
మంత్రి వెంట జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఆర్డీఓ వై. భవానీశంకరి, డివిజినల్ పంచాయతీ అధికారి సుందరి, వివిధ శాఖల అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in