Grievance:ఏలూరు,ఆగస్టు 19:విభిన్న ప్రతిభావంతుడైన విద్యార్థి కోరిన వెంటనే డయాస్పె ప్లేయర్ ని పది నిమిషాలలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అందజేశారు.
ఏలూరు కండ్రికగూడెంకు చెందిన కందుల మిలన్ శ్యాం (17) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మీకోసం కార్యక్రమంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారిని కలిసి తన విద్యాభ్యాసం కోసం డయాస్పె ప్లేయర్ అవసరమని అర్జీ అందజేశాడు. వెంటనే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పందించి విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారులతో మాట్లాడి ప్లేయర్ ను తెప్పించారు. 10 నిమిషాల్లో ఆ ప్లేయర్ ను శ్యాం కు అందజేసి సమస్య పరిష్కరించారు. క్లాస్ రూం లో బోర్డుపై చెప్పిన విషయాన్ని రికార్డ్ చేసుకుని ఇంటి దగ్గర వాటిని తిరిగి వినే దుకు ఈ డయాస్పె ప్లేయర్ ఉపయోగపడుతుంది. అడిగిన వెంటనే ప్లేయర్ అందించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ని శ్యామ్ కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్బంగా పలువురు అధికారులు కూడా కలెక్టర్ ను అభినందించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in