hair care:మనమే హెయిర్ సీరమ్ తయారు చేసుకుందాం
హెయిర్ సీరమ్ వాడొచ్చా
ఇప్పుడు అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం సీరమ్ గురించే ఏమిటి సీరమ్ ఎందుకు వాడుతున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గతంలో పెద్దవాళ్ళు రకరకాల ఆయుర్వేదిక్ మూలికలను కలిపి నూనెను తయారు చేసేవారు. ఈ ఆయిల్ ను తలకు పట్టించి జుట్టు మొదలను ,చిట్లిపోయిన జుట్టును సరి చేయడానికి ఉపయోగపడేవి.
అలాగే ఈ సీరమ్ కూడా కానీ ఇది ఆయిల్ కాదు. కానీ ఈ సీరమ్ కూడా జుట్టుకు బాగా పనిచేస్తుంది. సీరమ్ అనేది కూడా ఒక పద్ధతిలో ఈ పదార్థం ఇంత మోతాదు వేరొక పదార్థం ఇంత మోతాదు అని లెక్క ప్రకారంగా తయారు చేయబడినవి.
వీటిలో ప్రోటీన్స్ తో పాటు, దీనిలో రకరకాల ఎంజైములు, హోమియోపతి మందులు, ఆయుర్వేద మందులు వీటన్నిటి కలయికనే రసాయనాలుగా తయారు చేసి సీరమ్ ను తయారు చేస్తున్నారు.
సీరమ్ వల్ల కూడా జుట్టు చాలా బాగా పెరుగుతుంది. ఈ సీరమ్ హెయిర్ ను కండిషన్ చేయడంలో, హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉపయోగపడుతుంది.
మార్కెట్లో వివిధ రకాల సీరమ్ లు లభిస్తున్నాయి .మన ఇంట్లో కూడా సీరమ్ ను తయారు చేసుకోవచ్చు.
వీటి తయారీకి కావలసినవి అలోవెరా జెల్, విటమిన్ E క్యాప్సిల్ , రోజ్ వాటర్ ను తీసుకోవాలి. అలోవెరా జెల్ జుట్టును సిల్కీగా మృదువుగా ఉంచడానికి, విటమిన్ ఈ క్యాప్సిల్ హెయిర్ ఫాల్ ఉన్నవారికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది.
రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల సాఫ్ట్ గా షైనీగా కావడానికి సహకరిస్తుంది కాబట్టి ఈ మూడింటిని ఉపయోగించి సీరమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ముందుగా ఒక ఖాళీ స్ప్రే సీసాను తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసి మూడు స్పూన్ల అలోవెరా జెల్ ను ,రెండు విటమిన్ E క్యాప్సిల్ ను, ఐదు స్పూన్ల రోజ్ వాటర్ ను వేసి మూత పెట్టి బాగా కలపండి.
అంతే ఈ సీరమ్ రెడీ అయినట్టే ఈ సీరమ్ ను మీరు తలస్నానం చేసిన తరువాత కుదురులకు హెయిర్ కి కొంచెం కొంచెం గా స్ప్రే కొడితే మీ హెయిర్ చాలా స్మూత్ గా షైనీగా కనిపిస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in