Hair Growth Tips: మీ జుట్టు సిల్కీగా స్మూత్ గా కావడం ఎలా జుట్టు సిల్కీగా స్మూత్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు దీనికోసం మార్కెట్లో దొరికే వివిధ షాంపులను కెమికల్స్ ను వాడి జుట్టును డ్యామేజ్ చేసుకుంటున్నారు .
దీనివలన జుట్టు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే హెయిర్ ను సహజ పద్ధతిలో ఇంట్లోనే దొరికే వాటితో సిల్కీగా స్మూత్ గా చేసుకుందాం దీనికి కావాల్సినవి రెండే రెండు అవి ఏమిటంటే ఒకటి మన ఇంట్లో దొరికే కలబంద ,ఇంట్లో కలబంద మొక్క లేకపోతే అలోవెరా క్రీమ్ బయట దొరుకుతుంది.
దీనినికూడ ఉపయోగించవచ్చు రెండవది పంచదార ఈ రెండిటితో మీ హెయిర్ ను మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు.
ముందుగా కలబందను మన హెయిర్ కు కావాల్సినంత తీసుకొని పక్కన పెట్టండి. ఎందుకు అంటే కలబంద కోసిన తరువాత గ్రీన్ గా వచ్చే పొరను తీసేయండి అది జుట్టుకి మంచిది కాదు .తరువాత కలబంద గుంజును తీసుకొని దానిలో పంచదార కలిపి గ్రైండ్ చేయండి.
ఈ మిశ్రమాన్ని తలకు కుదుళ్లకు బాగా పట్టించి ఒక గంట సేపు ఉంచిన తరువాత తల స్నానం చేయండి .తరువాత మీ జుట్టు చాలా సిల్క్ గా స్మూత్ గా అవ్వడం మీరే చూస్తారు.
దీని వలన జుట్టుకుదుర్లు బలపడి పలచబడిన జుట్టు రావటానికి కూడా సహకరిస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం
మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in