Hair Loss tips Telugu
హెయిర్ ఫాల్ ఎందుకు ఎక్కువగా వస్తుంది?
జుట్టు రాలటం అనేది వంశపారంపర్యయంగా, హార్మోన్ల చేంజెస్, విటమిన్ లోపం లేదా వృద్ధాప్యంలో సాధారణ జుట్టు రాలచు.
వాటి కారణం గా ఎవరి తలపై వెంట్రుకలు ఐనా రాలిపోవచ్చు, కానీ పురుషులలో ఈ మధ్య ఇది సర్వసాధారణం అయిపోయింది.
బయోటిన్ తీసుకున్న తర్వాత జుట్టు ఎందుకు రాలుతుంది?
బయోటిన్ అనేది జుట్టు ఆరోగ్యంలో చిన్న పాత్రే పోషిస్తుంది. కానీ దీని లోపం పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. అదే విధంగా, విటమిన్ డి లోపం, శరీరంలో జింక్ లోపం, విటమిన్ ఎ అధికంగా ఉండడం వల్ల జుట్టు రాలిపోతుంది.
అదే విధంగా విటమిన్ ఇ , ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ సి, అలాగే విటమిన్ బి3 లోపలా వల్ల జుట్టు రాలిపోతుంది.
10,000 mcg biotin చాలా ఎక్కువ?
పెద్దలకు సాధారణ సజ్జిస్ట్ చేయబడిన బయోటిన్ పవర్ రోజుకు 30 నుండి 100 (mcg)మాత్రమే .
కానీ అధిక పవర్ కలిగిన బయోటిన్ హానికరం లేదా విషపూరితం కలిగించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు , అందుకే మీరు సాధారణంగా 5,000 నుండి 10,000 mcg
వరకు ఉన్న బయోటిన్ మెడిసిన్ బయట చూస్తారు చూస్తారు.
ఎంత mcg వాడాలి అనేది మీ వైద్య నిపుణుల సలహామేరకు మాత్రమే వాడాలి.
Biotin జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందా?
బయోటిన్ లోపం జుట్టు రాలడానికి దారితీయవచ్చు మరియు మెడిసిన్ జుట్టు పెరుగుదలకు సహాయపడవచ్చు.
అయినప్పటికీ, బయోటిన్ లోపం లేనివారిలో జుట్టు పెరుగుదలను పెంచుతాయని నమ్మకం లేదు. బయోటిన్ అనేది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వుల నుండి ఎనర్జి మరియు పోషకాలను పొందడానికి శరీరానికి సహాయపడే ఒక ముఖ్యమైన B విటమిన్.
జుట్టు పెరుగుదల కోసం biotin మాత్రలు ఉపయోగించవచ్చు?
బయోటిన్ ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం మరియు గోళ్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ముఖ్యమైన పోషకం.
ఇది జుట్టు పెరుగుదలకు మరియు మొత్తం జుట్టు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది మరియు దీనిని మాత్రలు లేదా క్యాప్సూల్స్ రూపంలో సప్లిమెంట్‌గా తీసుకోవచ్చు బయోటిన్ సప్లిమెంట్‌గా మరియు క్యాప్సూల్స్ వాడేముందు మీ వైద్యనిపుణుడిని సంప్రదించాలి.
Remedies to control hair fall:
జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం తినాలి?
అవిసె గింజలు పొద్దుతిరుగుడు వంటి విత్తనాలు ఈ విత్తనాలలో విటమిన్ ఇ, జింక్ మరియు సెలీనియం ఉన్నాయి, ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
ఒక ఔన్స్ పొద్దుతిరుగుడు గింజలు మీ రోజువారీ విటమిన్ ఇలో సగం అందిస్తుంది. అవిసె గింజలు మరియు చియా గింజలు కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ను కలిగి ఉంటాయి.
ఈ విత్తనాలను రోజు మన ఆహారం లో భాగం చేసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తాయి
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మీరు ప్రయత్నించే అనేక సహజ నివారణలు మరియు ఇంట్లో వస్తువులను వాడి జుట్టును సంరక్షించుకునే కొన్ని ఇంటి చిట్కాలను చూద్దాం.
ఆనియన్ కర్రీ లీవ్స్ హెయిర్ పేస్ట్:
ఉల్లిపాయలో డైటరీ సల్ఫర్ ఉంటుంది. ఇది మీ స్కాల్ప్ మీద కెరోటిన్ మరియు ఇతర ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది మీ జుట్టును బలంగా చేస్తుంది. ఈ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలంటే
ముందుగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను మరియు గుప్పెడు కరివేపాకు ఆకులను కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.
ఈ పేస్టును ఒక గంట సేపు తలకి పట్టించి గాఢత తక్కువ ఉన్న షాంపుతో కడిగేసుకోవచ్చు. ఈ పేస్ట్ ని వారానికి ఒకసారి వాడొచ్చు.
మెంతులు మరియు మందార పువ్వుల పేస్ట్:
మెంతులలో ఐరన్ మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.ఇవి మీ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి.
మందార పువ్వులోని మరియు ఆకులో కూడా flovonoids ఉంటాయి.
ఇవి మీ జుట్టు కుదుళ్లలోని రక్తప్రసరణ మెరుగుపరిచి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేసి జుట్టు ఊడకుండా చేస్తాయి.
ఈ హెయిర్ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలంటే రెండు టీ స్పూన్ల మెంతులను ఒకరోజు రాత్రంతా కొద్దిగా నీటిలో నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టిన మెంతులను అదే నీటిలో ఉడకబెట్టి చల్లారనిచ్చిన తర్వాత అందులో నాలుగు మందారపు రేఖలు మరియు ఆకులు కలిపి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పేస్టును తలకు కుదుళ్ళ నుండి బాగా పట్టించి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మరియు గాఢత తక్కువ ఉన్న షాంపూతో కడిగేసుకోవచ్చు.
ఈ చిట్కాలను పాటించడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా మరియు బలంగా తయారయ్యి జుట్టు ఊడకుండా ఉంటుంది.
ఇంకా ఇవే కాకుండా విటమిన్లు మరియు ఖనిజాలు, ముఖ్యంగా ఇనుము, జింక్ మరియు విటమిన్ ఇ అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోండి.
సున్నితమైన షాంపూతో క్రమం తప్పకుండా తల స్నానం చేయడం ద్వారా మీ స్కాల్ప్‌ను శుభ్రంగా మరియు బిల్డప్ లేకుండా ఉంచండి.
బిగుతుగా ఉండే కేశాలంకరణ అంటే హెయిర్ స్టైల్స్ మరియు అధిక వేడి స్టైలింగ్ పరికరాలను ను వీలైనంత వరకు తగ్గించండి, ఎందుకంటే ఇవి జుట్టును బలహీనపరుస్తాయి.
రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మీ నెత్తికి క్రమం తప్పకుండా రోజ్మేరీ ఆయిల్ తో మసాజ్ చేయండి.
ఇది రక్తప్రసరణను పెంచుతుంది. రక్తప్రసరణ బాగా జరిగితే జుట్టుకు సరైన సమయంలో సరైన పోషణ అందుతుంది.
కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం వంటి సహజ నూనెలను మీ తల చర్మం మరియు జుట్టుకు పోషణ అందించడంలో చాలా ఉపయోగపడతాయి.
ధ్యానం లేదా యోగా వంటి సడలింపు పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించండి, ఒత్తిడి జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది.
సహజ నివారణలను ప్రయత్నించినప్పటికీ మీ జుట్టు రాలడం కొనసాగితే వ్యక్తిగతీకరించిన సలహా కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులు లేదా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in