Hair oil:తలకి నూనె పెడుతున్నారా? మారిన జీవనశైలి ,పోషకలేమి ,అశ్రద్ధ వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుందా మరి దీనికి అడ్డుకట్ట వేయాలంటే జిడ్డు కారుతుందని,ముఖం కళ పోతుందని కొందరు జుట్టుకి అసలు నూనె పెట్టరు.
ఇంకొందరేమో వారంలో ఆరేడు రోజులు నూనె తలతోనే ఉంటారు.ఇంతకీ జుట్టుకి ఏది మంచిది? అన్న సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది.అయితే ఈ రెండు తప్పే అంటారు సౌందర్య నిపుణులు .జుట్టుకి పోషణ అందాలన్నా, అవి పొడిబారి నిర్జీవంగా మారకూడదన్న…రెండు రోజులకోసారైనా నూనె పెట్టాలి.తర్వాత జిడ్డుతలతో బయటకు వెళ్లడం మంచిది కాదు.ఓ గంట తర్వాత తప్పక తల స్నానం చేయాలి.అప్పుడే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
తల స్నానం చేశాక జుట్టును డ్రాయర్లతో ఆరబెట్టుకుంటున్నారా?ఇకమీదట ఆ పని చేయకండి.వేడి వల్ల వెంట్రుకలు చిట్లి పాడవుతాయి.తడి తలపై మెత్తటి తువాలుతో ఒత్తలే కానీ బలవంతంగా రుద్దడం దులపడం వంటివి చేయొద్దు.ఇవన్నీ జుట్టును బలహీనపరిచేవే.
చాలామంది జుట్టుని తరచూ గాలికి వదిలేస్తారు, చిక్కులు తీయరు.కాస్త వదులుగా అయినా అల్లుకుంటే పాడవదు .అలానే దువ్వెన నాణ్యంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి .అది పూర్తిగా తడి ఆరాకనే దివ్వాలి.తర్వాతే జడ వేసుకోవాలి లేదంటే చుండ్రు ఇబ్బంది పెడుతుంది .జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in