Harrasment: కుక్కునూరు మండలానికి చెందిన చిన్నారిపై అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని శుక్రవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పరామర్శించారు.
కుటుంబసభ్యులను కలిసి సంఘటనకు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో తనను కలిసిన పాత్రికేయులతో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జరిగిన సంఘటనపై పోక్సో చట్టం కింద విచారణ జరుపుతున్నామని, చిన్నారికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయన్నారు. వైద్య పరీక్షలు, విచారణ అనంతరం నేరం రుజువైతే నేరానికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి పోక్సో చట్టం కింద సహాయం అందిస్తామన్నారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు, పోలీసు విచారణ జరుగుతున్నాయని, విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in