Read Time:2 Minute, 0 Second
Headache:తలనొప్పి ఎక్కువైతే తల మొత్తం నొప్పి భరించలేక చాలా మంది రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.
ఇది ప్రమాదకరమని చెబుతున్నారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
- తాజా ద్రాక్ష పండ్లను తీసుకొని జ్యూస్ చేసి తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగితే సరిపోతుంది.
- ఒత్తిడిని, ఒళ్ళు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అల్లం తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
- . దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు తలనొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకొని 30 నిమిషాల తరువాత వేడి నీటితో కడిగితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
- తలనొప్పి ఎక్కువైనప్పుడు మసాజ్ చేసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మెడ, తలభాగాన్ని నొక్కుతూ మెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరిగి రిలాక్స్ అవుతారు. నొప్పి కూడా దూరం అవుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in