HEAL School:హీల్ పారడైస్ లో 2024-2025 గాను 1 తరగతి నుండి 11 వ తరగతి వరకు CBSE విధానం లో భోదన మరియు ఆండ్రోయిడ్ డెవలప్మెంట్ కోర్సు లో ప్రవేశం.
హీల్ పారడైస్ లో 1-5 వ తరగతి వరకు ప్రవేశాలు ప్రారంభం.
అడ్మిషన్ కొరకు 01-04-2024 నుండి హీల్ వెబ్సైట్ ను విసిట్ చేయగలరు Click Here
అడ్మిషన్ సమాచారం కొరకు కాల్ చేయవల్సిన ఫోన్ నెంబర్లు : 9100024438,9100024435;
హీల్ పారడైస్
హీల్ పారడైస్ (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ అల్)
అనేది తల్లిదండ్రులు లేని పిల్లలకు మాతృత్వ మధురిమలు, ఉన్నతమైన విద్య ,ఆరోగ్యం ,వినోదాల వెలువగా మారి తల్లిదండ్రులు లేని వారి జీవితాలలో వెలుగును నింపుతుంది.
వారి భవిష్యత్తులో మర్చిపోలేని తీపి గుర్తులు ఇస్తుంది.
ఒక మనిషి తన జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నాను తన పిల్లల భవిష్యత్తు బాగుందా .అనే ఆలోచించే మనుషుల మధ్య సంతోషం అంటే మనం కాదు సమాజం బాగు అనే ఆలోచనతో వచ్చినదే” హీల్ పారడైస్” అనే సంస్థ ఇలాంటి ఆలోచన గుంటూరుకు చెందిన కోనేరు సత్య ప్రసాద్ గారు వృత్తిపరంగా డాక్టర్ విదేశాలలో కూడా పనిచేసే వచ్చారు. అందరికీ విద్యా వైద్యం అనే ఆలోచనను సహకారం చేసే క్రమంలో తన వంతుగా “హీల్ పారడైస్” అనే సంస్థను ఏర్పాటు చేశారు.పలువురు పారిశ్రామికవేత్తలు ఉన్నత హోదాలో పనిచేసే పదవి విరమణ చేసిన అధికారులు ఇందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తునటుగా తెలుస్తుంది.
పచ్చని చెట్లు మొక్కలు కొండలు ఎటు చూసినా పచ్చదనం కలిగిన విద్యాలయం” హీల్ పారడైస్” తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మంచి చదువులు జీవితం లో ఉన్నతమైన స్థాయికి వెళ్లాలని ఆలోచన నుండి పుట్టిందే “హీల్ పారడైస్ ” (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్) అనే ఆలోచనతో రూపుదిద్దుకున్నదే ఈ విద్యాలయం .విద్యా’ వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో” హీల్ “సంస్థ తరఫున పలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.అదే స్ఫూర్తితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి లో 2014 హీల్ పారడైస్ ను కోనేరు సత్యప్రసాద్ గారు ఏర్పాటు చేశారు. ఈ హీల్ సంస్థ 1993 లోనే భారత దేశంలో ఏర్పాటు చేయబడింది .
ఈ సంస్థలో చదివి విదేశాలలో ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఉన్నారు.
ఇక్కడ విద్యార్థులకు అంతా ఉచితమే.తల్లిదండ్రులు లేని పిల్లలకు తొలి ప్రాధాన్యం.కుటుంబ నిర్లక్ష్యనికి గురి అయిన పిల్లలకు తర్వాత అవకాశం కల్పిస్తారు వీరికి రెండవ ప్రాధాన్యం.తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేని వారికి మూడవ ప్రాధాన్యం ఇస్తారు .పత్రికల్లో వచ్చే వార్తలు ,స్వచ్ఛంద సంస్థలో సేకరించే సమాచారం ఆధారంగా క్షేత్ర పరిశీలన చేసి ఈ పిల్లలను తీసుకువస్తారు.
తల్లిదండ్రులు ఉన్న పిల్లలకే ఇప్పుడు కార్పోట్ విద్య ,వైద్యం అందడం కష్టమవుతున్న ఈ రోజులలో పిల్లలను తన పిల్లలుగా భావించి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తల్లిదండ్రుల్లాగా చూసుకుంటారు ఇక్కడ నిర్వాహకులు.
పిల్లలకు ప్రత్యేకించి వసతి గృహాలు కలవు.అబ్బాయిలకు అమ్మాయిలకు వేరువేరు వసతి గృహాలు కలవు.
ప్రైమరీ పిల్లలకు టెంట్ లాగా ఉన్న గృహాలు ,హై స్కూల్ పిల్లలకు బిల్డింగులు కలవు.
పిల్లలు కింద పడుకోకుండా మంచాలు ఏర్పాటు చేయడం అయ్యింది.ఒకేసారి 200 మంది భోజనం చేసే వసతి కలదు.
ఈ సంస్థలో అడుగుపెట్టిన పిల్లలు తిరిగి వారు జీవితంలో స్థిరపడే అంతవరకు పిల్లల బాగోగులను ఇక్కడ నిర్వాహకులే చూసుకుంటారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు తీసిపోకుండా ఉండే విద్యా విధానం .డిజిటల్ తరగతులు ,కంప్యూటర్ ల్యాబ్ ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకమైన ప్రయోగశాలలు ఉన్నాయి.
భాషా తరగతులు సైతం ల్యాబ్ లోనే నిర్వహించడం విశేషం. అంతేకాదు పక్కన వాళ్ళతో ఎలా మెలగాలి ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగే ఆనందం వంటివి కూడా నేర్పిస్తారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అన్ని క్రమ పద్ధతిలో సాగుతుంది ఈ విద్యార్థుల జీవన విధానం. లేవగానే యోగా తర్వాత క్రీడలు తర్వాత అల్పాహారం 9 గంటలకు స్కూల్ ప్రారంభం.
మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఆటలు రాత్రి భోజనం తరువాత స్టడీ అవర్స్ రీతిలోనే ఉంటుంది .డిజిటల్ తరగతుల ద్వారా పాఠాలు సులువుగా అర్థం చేసుకుంటారు.
శాస్త్రీయ అంశాలపై ప్రయోగాలు కచ్చితంగా నిర్వహిస్తారు .సైన్స్ పాఠాలకు నమూనా తప్పనిసరి.
ఒకటి రెండు తరగతిలో హోంవర్క్ అనే పద్ధతి కచ్చితంగా అని కాకుండా వాళ్ళ మనస్తత్వాన్ని మమేకం చేసుకొని పిల్లలను విద్య అలవాటు చేస్తారు.
అలాగే విద్య చెప్పే విధానము కూడా చెబితే కాకుండా చూస్తే ఎక్కువ గుర్తు ఉండి త్వరగా నేర్చుకుంటారు అని పెయింటింగ్ లా ద్వారా, డిజిటల్ తరగతుల ద్వారా చూపిస్తూ వారికి అర్థమయ్యేలాగా పాఠాలు చెబుతారు.
విద్యా సంస్థ నుండి వసతి గృహాల నుండి వచ్చే మురికి నీటిని కూడా మంచినీటిగా మార్చడం.
సంస్థ బిల్డింగ్ పై సౌర పలకల విధానాన్ని అమర్చి సంస్థకు అయిన విద్యుత్తు తయారీలో విద్యార్థులు స్వయంగా సహకరిస్తున్నారు. అలాగే విద్య మాత్రమే కాకుండా ప్రకృతిలో మమేకం కావడం కోసం మొక్కల పెంపకం ,వ్యవసాయం వంటివి కూడా తెలుసుకునే లాగా చేస్తారు. సంస్థ ఉపయోగించే కూరగాయల రద్దును, మిగిలిపోయిన ఆహారాన్నితడి చెత్త పొడి చెత్త గా వేరు చేసి సేంద్రియ ఎరువులను కూడా విద్యార్థులు తయారు చేస్తున్నారు. ఈ ఎరువులను సంస్థలో గల మొక్కలకు పంటలకు వేస్తారు.మిగిలిన ఎరువులను అవసరమైన వాళ్లకు ఇస్తారు. ఈ సంస్థకు కావలసిన కూరగాయలను ఈ విద్యార్థులే పండిస్తున్నారు.
అంతేకాదు సాంస్కృతి కార్యక్రమాల్లో కూడా పిల్లలను ప్రోత్సహిస్తారు. అలాగే 15000 పుస్తకాలతో కలిగిన గ్రంధాలయం కలదు మరియు వైద్యులు కూడా ఎల్లప్పుడూ పిల్లల కోసం అందుబాటులో ఉంటారు. పిల్లలకు వేటిపై ఇంట్రెస్ట్ ఉందో వాటిపై వారిని ప్రోత్సహిస్తూ వాళ్ళ వెన్ను తడతారు. ఇంటర్మీడియట్ పూర్తి అయి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రవేశ పరీక్షలు విద్యాలయం లో నిర్వహించి అర్హులకు యాప్ డెవలప్మెంట్ కంటెంట్ డిజైన్ సెబర్ సెక్యూరిటి కోర్సు లను నేర్పుతారు పిల్లలకు స్వర్గసీమ లాంటి విద్యాలయం ఇది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in