Healthy Breakfast: రాగి ఇడ్లీలు: ముందుగా ఒక గిన్నెలో కప్పున్నర రాగులను, ముప్పావు కప్పు ఎర్ర బియ్యం, అరకప్పు మినప గుళ్ళు, పావు స్పూన్ మెంతులు వేసుకొని మూడు, నాలుగు సార్లు శుభ్రంగా కడిగి వీటిని ఎనిమిది నుండి పది గంటలు నానబెట్టాలి.
ఇలా ఎనిమిది నుండి పది గంటలు నానిన తరువాత అర కప్పు వరకు ఎర్ర అటుకులను వేసి ఇంకా 15 నిమిషాలు నానబెట్టాలి.ఎలా నానిన పప్పుని ఇడ్లీ పిండి మిశ్రమం లాగా గరుకుగా గ్రైండ్ చేయాలి.
తరువాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత ఉప్పును వేసి చేతితో రెండు మూడు నిమిషాలు బాగా కలిపి మూత పెట్టి ఒక ఫుల్ నైట్ పిండిని పులియనివ్వాలి.
తర్వాత రోజు మార్నింగ్ ఇడ్లీ పాత్రలో ఇడ్లీ మాదిరి వేసి స్టవ్ మీద పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే వేడి వేడి రాగి ఇడ్లీలు రెడీ.
రాగి దోసెలు: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు రాగులు, పావు కప్పు బియ్యం,పావు కప్పు మినప గుళ్ళు, పావు స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా మూడు, నాలుగు సార్లు కడగండి. తరువాత నీటిని వేసి 8 నుంచి పది గంటల వరకు నానబెట్టాలి ఇలా నానిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తగినంత నీటిని పోసుకొని అట్లు పిండి మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి ఒక ఫుల్ నైట్ పులియనివ్వాలి.తర్వాత రోజు ఉదయం స్టవ్ మీద పెనం పెట్టి దోసెల మాదిరి వేసుకుంటే రాగి దోశలు రెడీ అయినట్టే.
Millet dosa: చిరుధాన్యాలతో చేసే దోస ఇది హెల్త్ కి వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడుతుంది. పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళకి వరకు ఎన్నో ఉపయోగాలు ఎన్నో పోషకాలు కలిగిన ఈ చిరుధాన్యాల తో చేసిన దోస ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
దీనిలోని బియ్యం ఉపయోగించం కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ద బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ.
ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళను, అరకప్పు రాగులు వేసి, ఈ రాగులు రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్ ని తగ్గిస్తాయి,ఎముకలు దృఢంగా చేస్తాయి, అంతేకాదు జుట్టుకి మన చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి.
రాగులు వేసిన తరువాత పావు కప్పు సామలు (little millet )వేసుకోండి.
ఈ సామలు లో ఉండే పోషక విలువల వల్ల షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.హాట్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా చేస్తుంది.జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
బెస్ట్ క్యాన్సర్ లాంటివి రాకుండా చేస్తుంది. తరువాత అరకప్పు దాకా జొన్నలు వేసుకోండి. ఈ జొన్నల ఉండే న్యూట్రిన్స్ వల్ల బోన్ హెల్త్ ని అలాగే హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
అలాగే డైజేషన్ సిస్టం కూడా ఇంప్రూవ్ చేస్తుంది. డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది. తరువాత అరకప్పు దాకా కొర్రలు వేసుకోండి.ఈ కొర్రలు వల్ల బోన్ మజిల్స్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి.గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది.
ఇమ్యూనిటీని పెంచి హెయిర్ కి స్కిన్ కి చాలా హెల్ప్ చేస్తుంది.నాలుగు రకాల చిరుధాన్యాలను మాత్రమే వాడుతున్నాము. ఈ చిరుధాన్యాల ప్లేస్ లో వేరొక చిరుధాన్యాలు రీప్లేస్ చేసుకోవచ్చు.
అంటే అరికలు, సజ్జలు అలా మార్కెట్లో దొరికే చిరుధాన్యాలను రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా పైన చూపించిన కొలతలు బట్టే చిరుధాన్యాలు తీసుకుంటే దోస అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది.
తరువాత అరకప్పు దాకా అటుకులను కూడా వేయండి. అలాగే పావు స్పూన్ మెంతులను కూడా వేయండి. ఇలా అన్ని వేసిన తరువాత శుభ్రంగా రెండు,మూడు సార్లు బాగా కడిగి తరువాత నీటిని పోసి మూత పెట్టి 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టాలి.
ఇలా నానిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని దోసెలు మాదిరి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఫుల్ నైట్ పులియనివ్వాలి.
మరసటి రోజు ఉదయం స్టవ్ పై పెనం పెట్టి దోసెల లాగా వేసుకోవడమే వేడి వేడి చిరుధాన్యాల దోస రెడీ అయినట్టే.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in