Henna health benefits:ఔషధాల గోరింటాకు ఆషాడ మాసంలో అతివల అరచేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటే ఐదుతనం గా ముత్తైదువులను నమ్మకం. కొత్తగా పెళ్లయిన యువతలు గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు.
శుభ సూచకమని వివాహాలు వివిధ శుభకార్యాలకు అరచేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటారు. పాదాలకు పారాణి అరచేతులకు అలంకారణంగా గోరింటాకు సుపరితమే. లేత గోరింటాకు కోసి మెత్తగా రుబ్బి పెట్టుకుంటే బాగా పండుతుంది. గోరింటాకులో సౌందర్య సాధనంగానే కాదు ఔషధ గుణాలు కూడా.
కాళ్లు, చేతులు అధికంగా నీటిలో నానడం వల్ల పుండ్లు పడుతుంటారు. అలాంటప్పుడు గోరింటాకును పెట్టుకోవడం వల్ల పుండ్లు తగ్గుతాయి.
నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి వెంట్రుకలు తెల్లబడటం తగ్గుతాయి.
ఆయుర్వేదంలో గోరింటాకును నోటిపూతకు చర్మ కాలేయం వంటి రోగాలకు ఔషధంగా వాడుతారు.
కీళ్ల నొప్పులు ,వాపులు ఉన్నవారు గోరింటాకు నూనెపై పూతగా వాడితే మంచి గుణం కనబడుతుంది.
గోరింటాకు చెట్టు ఆకులు రుబ్బి దానిని కాళ్ళ గోర్లు, చేతి గోర్ల చుట్టూ రెండు, మూడు గంటలు నాని, ఆరిన తరువాత తీసివేస్తే అది ఎర్రగా పండుతుంది. ఆకును గోళ్ళకు పెట్టుకోవడం వల్ల ఆకు రసం వల్ల గోళ్లు పుచ్చిపోకుండా పాడైపోకుండా గోళ్ళకు వేళ్ళకు ఏ విధమైన అంటూ వ్యాధులు సోకకుండా రక్షిస్తుంది.
గోరింటాకు పొడిని నూనెలో కలిపి వడకట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది. కళ్ళ మంటలు తగ్గుతాయి. ఒక స్పూన్ గోరింటాకు పొడి, తేనె తో కలిపి ప్రతి రోజు తాగితే రక్తం శుభ్రపడి చర్మంలో మెరుగుపరుస్తుంది.
గోరింటాకు పొడిని వాడటం కంటే సహజమైన గోరింటాకు వాడటం ఎంతైనా మేలు. గోరింటాకుతో ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతం అవుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in