High Tea:ఏలూరు, ఆగస్ట్, 15: జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ‘హై టీ ‘
కార్యక్రమం చక్కని ఆహ్లదకరం వాతావరణంలో జరిగింది. పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత, నృత్య,సాంస్కృతిక కార్యక్రమాలు, ఎంతో ఉల్లాసపరిచాయి. కార్యక్రమాలలో జిల్లా అధికారులు సరదాగా, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి,అడిషనల్ ఎస్పీ స్వరూపా రాణి,జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి,డి ఎఫ్ వో రవీంద్ర దామ ,ఆర్డీఓలు ఎన్ఎస్ కె. ఖాజావలి, వై. భవానీశంకరి, కె. అద్దయ్య, సెబ్ జాయింట్ డెరైక్టర్ ఎన్. సూర్యచంద్ర రావు,డిఆర్డీఏ పీడీ డా.ఆర్. విజయరాజు, జెడ్పి సి ఈ ఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు, డిపివో తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్ , డిఇఓ ఎస్. అబ్రహాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్ కె. హాబీబ్ భాషా, ఏపిఈపీడి సిఎల్ ఏస్ ఈ సాల్మన్ రాజు,సోషల్ వెల్ఫేర్ జె డి జయప్రకాష్,గృహ నిర్మాణ శాఖ పిడి,ఉద్యాన శాఖ డిడి రామ్మోహన్ , ఐసిడిఎస్ పిడి పద్మావతి,డి ఎఫ్ వో హిమశైలజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి పుష్పాలత,బిసి వెల్ఫేర్ అధికారి నాగరాణి, ఎపీఐఐసి జెడ్ యం కె.బాబ్జీ,జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కృపావరం, డీఐవో డా.నాగేశ్వర రావు,పశు సంవర్దక శాఖ జె డి నెహ్రూబాబు,సివిల్ సప్లైస్ డియం మంజుభార్గవి,డి సి పిఓ సూర్య చక్రవేణి,తదితరులు పాల్గొన్నారు.
అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు బయో డైవర్సిటీ పై నిర్వహించిన పోటీల్లో వకృత్వ విభాగంలో ఏస్ ఈ ఎస్ డీ యం స్కూల్ కు చెందిన వై. దివ్యశ్రీ ,శార్వాణి స్కూల్ చెందిన టి హాస్య సుమ, గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ చెందిన పి .జెస్సికా , డిబేట్ కాంపిటీషన్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్ చెందిన పీ.ఎలిష,కస్తూరిబా స్కూల్ కి చెందిన బి శ్వేత ,లిటిల్ బడ్స్ స్కూల్ కి చెందిన పీ. ఎలీషా, షార్ట్ ఫిలిం విభాగంలో పల్లెర్ల మోడీ జెడ్పీ హైస్కూల్ కింద పి మౌనిక, శర్వాణి స్కూల్ కి చెందిన డి కుసుమ, కైకరం జడ్పీ హైస్కూల్ కు చెందిన బి దేవి నాగలక్ష్మి లు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు పొందారు.వీరికి జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి,జాయింట్ కలెక్టర్ పీ.ధాత్రి రెడ్డి సర్టిఫికెట్లు, మెమోంటో లు అందజేశారు.వీరితో పాటు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న బాలికలకు మెమోంటో లు అందజేశారు
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in