HIV/AIDS:ఏలూరు, ఆగస్టు, 12… హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన, వివరాలను పొందేందుకు ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ 1097 నెంబర్ ను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.
నాకో మార్గదర్శకాలతో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆజ్ఞాలతో రెండు నెలలపాటు “మీ కోసం” (Intensified IEC Campaign) అనే కార్యక్రమం 12 ఆగస్టు 2024న నిర్వహించబడుతున్న కార్యక్రమాన్ని సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమములో బాగంగా రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి జిల్లా అధికారుల సమక్షంలో విడుదల చేశారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతీ గర్బిణి స్త్రీ కి మొదటి మూడు నెలల్లోనే హెచ్ఐవి పరీక్షలు జరిగేలా చూడాలన్నారు. హెచ్ఐవి, ఎయిడ్స్ రహిత సమాజం కోసం అందరూ కృషిచేయాలని కోరారు.
జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారి డా. ఎమ్ నాగేశ్వర రావు “మీ కోసం” (Intensified IEC Campaign) అనే కార్యక్రమం గురించి వివరిస్తూ ఈ కార్యక్రమము 8 వారాల పాటు 8 ప్రత్యేక సమాచార నేపద్యంతో నిర్వహిస్తారన్నారు. వాటిలో 1) ప్రసార మార్గాలు & నివారణ వ్యూహాలు 2) అనుమానాలు మరియు అపోహలు 3) రిస్క్ అవగాహన మరియు సేవల ప్రచారం 4) జాతీయ టోల్ ఫ్రీ నెంబర్ 1097 ఎయిడ్స్ హెల్ప్ లైన్ ప్రచారం 5) కండోమ్ ప్రమోషన్ & సురక్షితమైన లైంగిక ప్రవర్తనలు 6) ఎస్టిఐ నివారణ & చికిత్స 7) మాదకద్రవ్యాల వాడకం నివారణ .8) కళంకం మరియు వివక్ష నివారణ అని తెలియజేస్తూ, జిల్ల అధికారులు అందరూ “మీ కోసం” (Intensified IEC Campaign) కొరకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
కార్యక్రమములో జిల్లా రెవెన్యూ అధికారి డి. పుష్పమణి, డి.ఆర్.డి.ఏ,పిడి ఆర్. విజయ రాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యం. ముక్కంటి, కె. భాస్కర్, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పి. బాలాజీ, జిల్లా సూపర్ వైజర్ ఏ. హరినాధ కుమార్, జిల్లా హెచ్. ఐ. వి పాజిటివ్ నెట్వర్క్ ప్రెసిడెంట్,. శివ కృష్ణ , పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in