Honey Benefits:తేనె వలన ఉపయోగాలు
తేనెను స్వీకరించి మనుషులకు ఆహారంగా ఇచ్చే కీటకాలు తేనెటీగలు ఒక్కటే. మూడు కోట్ల సంవత్సరాల క్రితం నుండి తేనెను వాడుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి.
తేనెటీగకు ఐదు కళ్ళు ఉంటాయి. మామూలుగా ఉండే రెండు కళ్ళు కాకుండా మరో బుల్లి మూడు కళ్ళు ఉండటం వీటికి ప్రత్యేకం.
కొబ్బరి నీళ్ల వలె ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైనది తేనె. తేనెటీగలు రకరకాల పూల మకరందాలను స్వీకరించి, తేనె రూపంలో మనకు అందిస్తున్నాయి. దాదాపు 50 వేల సంవత్సరాల ముందు నుండి తేనెను వాడుతున్నారని అంచనా.
తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు 100 రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని అంటారు. తేనె లో ఎన్ని రకాలు ఉన్నా అడవి తేనె ఆత్మీయత స్వచ్ఛమైనది. తేనే బలవర్ధకమైన ఆహారం కూడా.
తేనే శరీరంలో సూక్ష్మజీవులను ఎదగనివ్వకుండా సంహరిస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని ఇస్తాయి. తేనే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చిన్నచిన్న గాయాలకు చర్మ సంబంధమైన ఇబ్బందులను పోగొడుతుంది.
క్రమం తప్పకుండా తేనెను తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తేనెలో కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. తేనెలో దాచిన చెక్క పొడి కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు, గ్యాస్ ట్రబుల్ తగ్గుతాయి.
పావు గ్లాస్ గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకొని త్రాగితే బరువు తగ్గుతారు. తేనెలో కొంచెం మిరియాల పొడి కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది.
రెండు స్పూన్ల తేనెలో, కోడిగుడ్డులోని తెల్ల సోనా, శనగపిండి కలుపుకొని ముఖానికి మర్దన చేస్తే ఫేస్ కాంతి పెరుగుతుంది. ఒక కప్పు వేడి పాలలో, ఒక స్పూన్ తేనెను కలిపి పిల్లలకు త్రాగిస్తే అలసట దూరమై పుష్టిగా ఆరోగ్యంగా ఉంటారు.
రాత్రి పడుకునే మందు గోరువెచ్చని పాలలో తేనెను కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది. తేనెను వేడి పదార్థాలతో కలిపి త్రాగకూడదు.
తేనెను మరిగించకూడదు. తేనెను ఫ్రిజ్లో ఉంచకూడదు. తేనెను పసిపిల్లలకు వాడకూడదు.
ప్రకృతి సహజంగా లభించే తేనే రుచికే కాదు ఆరోగ్యం అందించడానికి కూడా ముందు ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in