how to make kids happy:చిన్నారులు నిత్యం సంతోషంగా ఉండటానికి కొన్ని టిప్స్.
మానసిక ఆరోగ్యం
పిల్లల్లో ఎదుగుదలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఆహారంతో పాటు వారి మానసిక పరిస్థితిని కూడా గమనించాలి.. ఇప్పుడు సంతోషంగా ఉండే చిన్నారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో చూద్దాం.
తల్లిదండ్రుల దగ్గరే భద్రత
పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల వద్ద ఉండటానికి ఇష్టపడతారు. తల్లిదండ్రుల దగ్గర మాత్రమే తాము జాగ్రత్తగా ఉన్నట్లు భావిస్తారు. ఇలా మీ బాబు లేదా పాపలో ఉన్నట్లయితే వారి ఎదుగుదల బాగున్నట్లే.
మద్దతు
పాజిటివ్ పేరెంటింగ్.. దీని అర్థం మీ పిల్లలకు మీరు మద్దతుగా ,అండగా ఉండటం. వారిలో ఉత్సాహం పెంచేలా మీ మాటలు ఉండాలి. ఇలా చేస్తే వారు సంతోషంగా ఉంటారు.
ఎక్కువ సమయం
కుటుంబ సభ్యులంతా కలిసి కాసేపు సమయం గడపాలి. ఇలా చేయడంతో బంధం బలంగా మారుతుంది. మీ పిల్లల భావాలు పంచుకోగలుగుతారు. ఎమోషనల్ గా హ్యాపీ గా ఉంటారు.
ఆడుకోవడానికి అవకాశం
పిల్లలు ఎక్కువ ఆడుకోవడంతో వాళ్లలో క్రియేటివిటీ పెరుగుతుంది. ఊహించే శక్తితో పాటు సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది. సంతోషంగానే ఉంటారు.
సరైన స్నేహం
మీ పిల్లలు ఎవరితో ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో గమనించండి. వారి చుట్టూ పాజిటివ్ గా మాట్లాడే వారు ఉంటే మేలు.
మంచి ఆహారం
పిల్లల్ని ఎదుగుదలలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలు నిండిన ఫుడ్ తింటే వారిలో ఆరోగ్యంతో పాటు సమస్యలను ఎదుర్కొనేందుకు కావలసిన ఆలోచన శక్తి వస్తుంది.
వ్యాయామం
పిల్లలకు కూడా వ్యాయామంపై అవగాహన ఉండాలి. చిన్నతనం నుంచే దీన్ని సాధన చేయిస్తే ఒత్తిడి,మానసిక సమస్యలు దూరం అవుతాయి.
స్వేచ్ఛ
పిల్లలకు కొంత వయసు వచ్చాక కంట్రోల్ చేయడం తగ్గించాలి. వారిలో ఆలోచనలు మొదలు కావాలంటే స్వేచ్ఛ ఇస్తేనే సాధ్యమవుతుంది.నిర్ణయాలు తీసుకోగలరు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in