ICDS:ఒరిస్సా రాష్ట్రం గజపతిజిల్లాకు చెందిన పిల్లలులేని దంపతులకు ఏలూరులోని శిశుగృహ నందు పెరుగుతున్న మహేష్ అను 3 నెలల వయస్సు గల మహేష్ ని కేరింగ్స్ ద్వారా రిజర్వ్ చేసుకున్న గజపతి జిల్లా,ఒరిస్సా రాష్ట్రం నుండి వచ్చిన మీనకిర్తన్ మహారాణ, సంద్యకుమారి మహరణ దంపతులకు శనివారం కలెక్టర్ క్యాంపు ఆఫీసు నందు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మహేష్(బాబు)ను దత్తత ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ దత్తత తీసుకున్న బాబుని మంచి పోషణతోపెంచి విద్యాభోదనలు నేర్పించి వారిని ఉన్నతమైన స్ధానంలోకి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. పిల్లలు లేని తల్లిదండ్రుల ఆవేదనలు అర్ధం చేసుకుని కారా నియమ నిబంధనలు సరళీకృతం చేసినారని వ్యక్తిగతం గా భార్యాభర్తలకు/తల్లిదండ్రుల కు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునే విధంగా ముందుకు వెళ్ళాలని వాళ్ళ సమస్యల వలన వారి పిల్లల ను ఇబ్బంది పెట్టవద్దు అని అలాంటి పిల్లలు ను షెల్టర్ హోమ్ లలో పెట్టీ చదివిస్తారని, చంటిబిడ్డల అయితే శిశు గృహ లో ఉంచి మరింత జాగ్రత్తగా చూసుకుంటారని తెలిపారు. కాల్వల్లో, తుప్పల్లో వదిలివేయవద్దని తెలియజేశారు. . ఈ కార్యక్రమంలో డి సి పి ఓ డాక్టర్ సి హెచ్ సూర్య చక్ర వేణి, శిశు గ్రహ మేనేజర్ భార్గవి పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in