ICDS ELURU:ఏలూరు, ఆగస్టు, 13… జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఏలూరు జిల్లా మిషన్ శక్తి సంకల్ప్ హెచ్.ఇ.డబ్ల్యూ 100 రోజుల అవగాహన కార్యక్రమాలలో 9వ వారం లో చేసే కార్యక్రమాలలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా కార్యాలయంలో మొక్కను నాటి ప్రారంభించారు. ఈ వారం అంతా జిల్లాలోని అన్ని ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ లు మరియు అంగన్వాడి కేంద్రముల వద్ద సిబ్బంది మొక్కలు నాటినట్లు ఐసిడిఎస్ పిడి పద్మావతి తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డా. సిహెచ్ సూర్యచక్రవేణి, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in