Idli or Dosa:ఇడ్లీ మంచిదా దోస మంచిదా
మన భారత దేశంలో అందరూ ఎక్కువ ఇష్టపడే టిఫిన్ లో ముందు వరుసలో ఉండేవి ఇడ్లీ, దోస మాత్రమే.
ఇడ్లీ కి ఉపయోగించే పదార్థాలు: మినప్పప్పు,బియ్యం.
దోసలో ఉపయోగించే పదార్థాలు:మినప్పప్పు ,బియ్యం.
ఒంట్లో బాగోలేని వారికి ఇడ్లీ పెడతారు చలువ చేస్తుంది అని. కానీ ఇడ్లీ తింటే చలువ, దోస తింటే వేడి అని అంటారు.
రెండింటికి ఉపయోగించేది మినపప్పు, బియ్యమే. కానీ దోస తింటే వేడి, ఇడ్లీ తింటే చలువ అని అంటారు.
మినప్పప్పు బియ్యం లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రెండిటిని నానబెట్టే చేస్తాం. నాన పెట్టడం వల్ల ఈస్ట్ బ్యాక్టీరియా వల్ల పిండి పులిసేటట్టు చేస్తుంది. చలువ, వేడి అనేది ఎలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దోశలు తీసుకుంటే దాని బేసిక్ లక్షణాలు ఏమిటంటే ఆమ్లాన్ని తగ్గిస్తుంది. శరీరనికి స్టామినా ఇస్తుంది. పురుషుల్లో వీర్యకణాలు రుద్దిని పెంపొందిస్తుంది. ముఖ్యంగా శ్లేస్మముని పెంచుతుంది.
శరీరంలో శేష్మము పెరగాలి కానీ శరీరం హీట్ అయిపోతుంది. అలాగే ఇడ్లీ తీసుకుంటే సేమ్ దోసలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలే ఇడ్లీ కూడా కలుగుతాయి. ఇడ్లీ అరగడానికి టైం పడుతుంది. దోశలు ఈజీగా ఫాస్ట్ గా అరిగిపోతుంది. ఒకే పదార్థాలు రెండింటికి మనం వాడినప్పుడు ఇడ్లీలో మనం నూనె వాడము ఆవిరితో ఉడికిస్తాం. దోసెలకు నూనెను వాడుతాము ఇడ్లీని స్టీమ్ చేస్తున్నారు కాబట్టి దీని లక్షణం అలాగే ఉంటుంది. దోసెను నూనెతో కాల్చడం వలన దీని లక్షణాలు వేరేగా ఉంటుంది. మన దోసెను కూడా మనం ఆవిరితో ఉడికిస్తే దాన్ని లక్షణం కూడా చలువ చేస్తుంది. కానీ నూనె వేసి దాని లక్షణాన్ని మార్చు తున్నాము. మన వాడేటటువంటి పదార్థాలకు అసలు లక్షణాలు పోయి కొత్త లక్షణాలు వస్తాయి. దీని వల్ల ఆరోగ్యం చెడిపోతుంది శ్లేస్మము రిలీజ్ చేయవలసిన అంటే చలువ చేయవలసిన ఈ పదార్థాల్లో మనం నూనె వేస్తే అది వేడిని రిలీజ్ చేస్తుంది. కాబట్టి దోసెలు కన్నా ఇడ్లీ తినడం వల్ల మన శరీరనికి చలువ చేస్తుంది. ఆరోగ్యానికి మంచిది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in