Independenceday:ఏలూరు, ఆగష్టు, 15 : స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తిని ప్రభోదించే రీతిలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ముందుగా ఏలూరు సెయింట్ థెరెసా బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 160 మంది విద్యార్థినులు ప్రదర్శించిన “వందనాలు.. వందనాలు రా.. వీరభారతి పుత్రుల విజయగాధ రా..” అంటూ భారత దేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలర్పించిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ చేసిన ప్రదర్శించిన నృత్యం సభికులను ఆకట్టుకుంది. కైకలూరు జాగృతి హై స్కూల్ కు చెందిన 90 మంది విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి ని ప్రభోదిస్తూ ” హిందుస్తానీ నామ్ హమారా హై ” ప్రదర్శన ఆహూతులను అలరించింది. ఏలూరు శ్రీ శర్వాణి హైస్కూల్ కు చెందిన 100 మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన “అమరావతి గీతం” ఆకట్టుకుంది. ఏలూరు సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ హై స్కూల్ కు చెందిన 60 మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన “నమో నమో భారతాంబే” దేశభక్తిని తెలియజేస్తూ చేసిన ప్రదర్శన అలరించింది. కలిదిండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన “వందేమాతరం అందాం. అందరం..” అంటూ, చైల్డ్ కేర్ సంస్థ విద్యార్థులు ప్రదర్శించిన
“కోయి మారేగా” అంటూ దేశభక్తితో కూడిన నృత్య ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. గోపన్నపాలెం కు చెందిన వ్యాయమ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్స్, మాల్కం, కోలాటం ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
ఏలూరు శ్రీ శర్వాణి హైస్కూల్ కు చెందిన 100 మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన "అమరావతి గీతం" ప్రదర్శనకు మొదటి బహుమతి, ఏలూరు శ్రీ శర్వాణి హైస్కూల్ కు చెందిన 100 మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన "అమరావతి గీతం" కు రెండవ బహుమతి, గోపన్నపాలెం కు చెందిన వ్యాయమ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్స్, మాల్కం, కోలాటం ప్రదర్శనలకు మూడవ బహుమతి లభించాయి.
కైకలూరు జాగృతి హై స్కూల్ కు చెందిన 90 మంది విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి ని ప్రభోదిస్తూ " హిందుస్తానీ నామ్ హమారా హై " ప్రదర్శన, ఏలూరు సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ హై స్కూల్ కు చెందిన 60 మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన "నమో నమో భారతాంబే" దేశభక్తిని తెలియజేస్తూ చేసిన ప్రదర్శన, కలిదిండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన "వందేమాతరం అందాం. అందరం.." ప్రదర్శనలకు కన్సోలేషన్ బహుమతులు లభించాయి. విజేతలకు రాష్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధ శాఖామంత్రి కొలుసు పార్థసారధి బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, న్యాయమూర్తులు బుల్లి కృష్ణ, ఎస్.కె.ఎండి . ఏ . పర్వీజ్ , జిల్లా న్యాయసేవాధికార సమస్త కార్యదర్శి కె. రత్నప్రసాద్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ , జాయింట్ కలెక్టర్ పి .ధాత్రిరెడ్డి, డిఆర్ఓ డి.పుష్పమణి, , ఆర్డీఓ ఎన్ .ఎస్. కె. ఖాజావలి , డి.ఆర్.డి. ఏ పీడీ విజయరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in