Industries:ఏలూరు,ఆగస్టు19:పరిశ్రమల ఏర్పాటుకు ఏలూరు జిల్లా ఎంతో అనువైన ప్రాంతమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.
సోమవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ప్రత్యేక జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ప్రతిపాధిత 2024-29 ఎపి పారిశ్రామిక అభివృద్ధి విధానం ముసాయిదాలో పొందుపరచవలసిన అంశాలను పారిశ్రామిక వేత్తలకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వివరించారు. ఈ సందర్బంగా ఎంఎస్ఎంఇ ఎంట్రాఫ్యూనర్ షిప్ 2024-29 విధానం, ఫుడ్ ప్రోసెసింగ్ పాలసీ 2024-29 ముసాయిదాలో పొందపరచవలసిన వివరాలను కూడా సమావేశంలో సమీక్షించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు భూమి లభ్యం లేదనేది అపోహనేనని పరిశ్రమల స్ధాపనకు ముందుకు వచ్చే వారికి భూమి అందుబాటులో ఉందన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు, విస్తరణకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. రాజధానికి సమీపంలో ఉన్న ఏలూరు జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైందని అదే సమయంలో మ్యాన్ ఫవర్, ఇతర సౌకర్యాలు అనుకూలమైన అంశాలని ఆమె పేర్కొన్నారు. ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు మరిన్ని జిల్లాలో స్ధాపన కావల్సివుందన్నారు. ఐటి ప్రాజెక్టులు ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని అందుకు తగిన సహకారాన్ని అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. 15 శాతానికి పైగా వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నూతన పారిశ్రామిక విధానంపై జిల్లాలోని పారిశ్రామిక వేత్తలతో చర్చించి పరిశ్రమల్లోని కీలక సమస్యలు, సవాళ్లు, అవకాశాలపై దృష్టిపెట్టడం జరుగుతుందన్నారు. అదే విదంగా ఆర్ధికేతర, ఆర్ధికజోక్యాలు కొత్త విధానంలో చేర్చబడ్డాయన్నారు. ఈ సమావేశంలో సూచనలు, ఫీడ్ బ్యాక్ ను సేకరించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తదుపరి ఈనెల 21వ తేదీన పరిశ్రమల శాఖా మాత్యుల అధ్యక్షతన రాష్ట్రస్ధాయి వర్క్ షాప్ నిర్వహించబడుతుందన్నారు. ఇది మన రాష్ట్ర భవిష్యత్ పారిశ్రామిక దృశ్యాన్ని రూపొందించడంలో సహాయపడే అభిప్రాయాలను, సూచనలను సేకరించేందుకు ఈ సమావేశం ఎంతో కీలకమైనదని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా పెట్టుబడి సౌకర్యం, రంగాల దృష్టి, రెగ్యులేటరీ పర్యావరణం, మౌలిక సదుపాయాలు, అనుబంధ సేవలు, సంబంధించి పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నూతన పారిశ్రామిక విధానం అభివృద్ధి చేయడానికి అవసరమైన విలువైన ఇన్ ఫుట్ ల కోసం పారిశ్రామిక వేత్తలతో చర్చించి వారి నుంచి అవసరమైన ప్రతిపాధనలను సేకరించారు. వాటన్నింటిని క్రోడీకరించి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందన్నారు.
సమావేశంలో పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వంకాయల రామకృష్ణ, సిక్కి, ఫిక్కీ ప్రతినిధులైన నిడదవోలు వెంకటేశ్వరరావు, సిర్రా భరత్, పలువురు పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చింతమనేని నవ్యశ్రీ, తదితరులు నూతన పారిశ్రామిక విధానంపై తమ తమ అభిప్రాయాలు, సూచనలు అందజేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు వి. ఆదిశేషు, ఎపి ఐఐసి జోనల్ మేనేజర్ కె. బాబ్జి, డిఆర్డిఎ పిడి డా. ఆర్. విజయరాజు, డిపివో టి. శ్రీనివాస్ విశ్వనాధ్, డిప్యూటీ ఇన్పేక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ ఆర్. త్రినాధరావు, ఉప రవాణా కమీషనరు ఎస్. శాంతకుమారి, ఉధ్యానశాఖ డిడి రామ్మోహన్, ఎల్ డిఎం డి. నీలాధ్రి, నాబార్డు డిడిఎం అనీల్ కాంత్, వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in