International Womens Day:ఏలూరు/నూజివీడు, మార్చి,8 : మహిళలే స్వర్ణాంధ్ర నిర్మాతలని, భూమి నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాలలోనూ పురుషులకంటే మిన్నగా మహిళలు తమ సత్తాను చాటుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నూజివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ప్రస్తుతం అన్ని రంగాలలో పురుషులకంటే మెరుగ్గా రాణిస్తూ మహిళా శక్తిగా నిరూపించుకుంటున్నారన్నారు.

ప్రపంచస్థాయి కార్పొరేట్ సంస్థలను ఎంతో సమర్థవంతంగా మహిళలు నిర్వహిస్తున్నారన్నారు. మహిళలలకు ఏదైనా కార్యక్రమం అప్పగిస్తే ఎవరికీ తీసిపోకుండా సమర్థవంతంగా నిర్వహించి తమ సత్తాను చాటుతారన్నారు.
ప్రపంచంలోని 195 దేశాలలో అత్యంత బలమైన ఆర్ధిక వ్యవస్థ కలిగిన భారతదేశానికి ఆర్దికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఎంతో ప్రతిభతో దేశాన్ని అభివృద్ధి బాటలో నిలుపుతున్నారన్నారని, ఇది దేశానికే గర్వకారణమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.730 కోట్లతో మార్చి 1,2025 నాటికి 93 లక్షల గ్యాస్ సిలిండర్లను దీపం పథకం కింద మహిళలకు అందించిందని, మహిళలకు టైలరింగ్ నందు శిక్షణతో పాటు జీవనోపాధి కొరకు కుట్టుమిషన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
జిల్లాలో 4589 మంది మహిళలకు రూ.11.47 కోట్లతో కుట్టుమిషన్లను ఉచితంగా అందించామన్నారు. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక మహిళ తప్పకుండా ఉంటుందన్నారు.
గత ప్రభుత్వ అరాచక పాలనలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ సమయంలో చంద్రబాబునాయుడు భార్యగా , లోకేష్ తల్లిగా జరిగిన అన్యాయాన్ని ఎదిరించి, నిజాలను ప్రజలకు తెలియచెప్పడంలో భువనేశ్వరి ఎంతో పోరాటం చేసారని, స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని మంత్రి పార్థసారథి చెప్పారు.
అమెరికాలో 15వేల మంది మహిళలు కొన్ని నెలల పాటు పోరాడిన ఫలితంగా మహిళలలు మార్చి 8వ తేదీని మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. .
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటిలో ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలని లక్ష్యంతో పనిచేస్తు న్నారన్నారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించి వారి జీవితాలను చక్కగా తీర్చిదిద్దాలన్నారు.
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించ డానికి చర్యలు తీసు కుంటున్నారని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో నవంబర్ నుండి 80 లక్షల మంది మహిళలకు 35 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించడానికి లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని,.
రాష్ట్రం లో దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నామని, సంవత్సరానికి మూడు ఉచితం గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 9వేల కోట్ల రూపాయలతో తల్లికి వందనం కార్యక్రమాన్ని త్వరలో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అన్న క్యాంటీన్లు, దీపం పథకాలను, పెన్షన్లు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం జరిగిందన్నరు.ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన మహిళలలను మంత్రి సన్మానించారు.
కార్యక్రమంలో నూజివీడు పురపాలక సంఘం మాజీ చైర్ పర్సన్ డా. బొబ్బిలి ఝాన్సీరాణి, రేమన్నపూడి నాగమణి, కొంపల్లి కృష్ణకుమారి, వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in