Itda: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని 5 మండలాల్లో బిఇడి / డిఇడి మరియు టెట్’ పాసై ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న గిరిజన యువతి యువకులకు ఉపాధ్యాయ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కోటరామచంద్రాపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జి.శ్రీను కుమార్ చెప్పారు.
స్థానిక ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారి చాంబర్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జి.శ్రీను కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజన యువతి యువకులు డిగ్రీతో పాటు బీఈడీ / ఇంటర్ తో పాటు డిఇడి టెట్’ పాసై ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న గిరిజన యువతి యువకులకు కోటరామచంద్రాపురంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. మహిళలకు 33.1/3 శాతం రిజర్వేషన్ సదుపాయం కలదని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్టు ఆగస్టు 14వ తేదీన ఐటీడీఏ కార్యాలయాపు నోటీస్ బోర్డ్ లో పొందుపరచడం జరుగుతుందన్నారు. ఫైనల్ లిస్ట్ ప్రకారం ఆగస్టు మూడో వారం నుండి 100 మంది గిరిజన అభ్యర్థులకు సుమారు 90 రోజులపాటు శిక్షణ అందించడం జరుగుతుందని, శిక్షణా కాలంలో భోజనము, వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. మార్చి-2024 లో శిక్షణ తీసుకున్న వారికి రీఫ్రెషల్ ట్రైనింగ్ అందించడం జరుగుతుందన్నారు. . ఈ శిక్షణకు అర్హత కలిగిన యువతి యువకులకు కోటరామచంద్రాపురంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 9603994333, 9490285277 సెల్ నెంబర్ కు సమర్పించాలని జి. శ్రీనుకుమార్ తెలియజేసారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in