Jangareddygudem: జూలై, 18… జిల్లా కలెక్టర్ వారి ఆదేశములు మేరకు గురువారం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం డివిజన్లలో గురువారం కురిసిన వర్షముల కారణముగా వేలేరుపాడు మండలం లో కోడిసేల కాలువ అల్లూరి నగర్ వద్ద ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహములో 5 మంది కారులో చిక్కుకొనిన అల్లూరి నగర్ గ్రామస్తులు వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించడమైనదని జంగారెడ్డిగూడెం ఆర్డివో కె. అద్దయ్య తెలిపారు. జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం వద్ద చిక్కుకొనిన 11 మందిని జేసిబి సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించడమైనదన్నారు.
జిల్లా కలెక్టర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రం అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామములో కట్టమైసమ్మగుడి వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద అవతల చిక్కుకున్న ఐదు కార్లు, నాలుగు ఆటోలు, 10 బైకులు మొత్తం 25 మందిని హెలికాప్టర్ సాయంతో రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందని చెప్పారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in