Job:ఏలూరు, ఆగస్టు, 9… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) SEEDAP ఇంటర్మీడియట్ బోర్డు హెచ్ సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్ సిఎల్ టెక్ బి కెరీర్ ప్రోగ్రాం ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించుటలో భాగంగా ది.14-08-2024 (బుధవారం) ఉ.09:00 గం//లకు సర్ సి.ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నందు “క్యాంపస్ డ్రైవ్” నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గంటా సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్ధులు తమ తల్లి లేదా తండ్రి తో హాజరు కావాలని అయన తెలిపారు.
హెచ్ సిఎల్ టెక్ ఫోగ్రాం అనేది 12వ తరగతి ( Non Maths (CEC,HEC,BIPC, Vocational ) లో పూర్తి చేసిన అభ్యర్థులకు హెచ్ సిఎల్ తో తమ కెరీర్‌ను ప్రారంభించే Early Career Program. భారతదేశపు అతిపెద్ద ఐటి కంపెనీలో ఒకటైన హెచ్ సిఎల్ తో అనుబంధం పొందడానికి ఇది ఉత్తమ అవకాశం.
2023 & 2024 కి సంబంధించిన ఇంటర్మీడియట్‌లో 75% కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ఈ ప్రోగ్రాం కి అర్హులు.నమోదు చేసుకున్న అభ్యర్ధులకు, ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ఎంపిక ప్రక్రియలో CAT exam same day (Career Aptitude Test)పరీక్ష లో ఎంపిక అయిన అభ్యర్ధులకు హెచ్ ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడ ఎంపిక అయిన అభ్యర్ధులు హెచ్ సిఎల్ నుండి టెక్ బి ప్రోగ్రాంలో చేరుటకు ఆఫర్ లెటర్ ని పొందుతారు. ఆఫర్ లెటర్ అనంతరం 51000/- రుసుము శిక్షణ నిమిత్తం చెల్లించవాలిసి ఉంటుందన్నారు.
ఈ టెక్ బి ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క కాలపరిమితి ఒక సంవత్సరం వుంటుంది. మొదటి 3 నెలలు క్లాస్ రూం ట్రైనింగ్ మదురై లో వుంటుంది. చివరి 9 నెలలు అభ్యర్థి internship కొరకు చెన్నై హెచ్ సిఎల్ క్యాంపస్ కి వెళ్ళవలసి వుంటుంది. Internship సమయంలో అభ్యర్థికి నెలకు రూ. 10,000/- చెప్పున Stipend అందించబడుతుంది. ట్రైనింగ్ ని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్ధికి ఉద్యోగిగా మారిన అనంతరం సంవత్సరంకు రూ. 1,70,000/- పొందవచ్చు.
అభ్యర్థులు ఇంటర్మీడయట్ అర్హతతో మిగిలిపోకుండా, హెచ్ సిఎల్ వారు అభ్యర్థుల ఉన్నత విద్యలో సహకారం అందిస్తారు. హెచ్ సిఎల్ వారు విశ్వవిద్యాలయాలైలో SASTR, AMITY and KL univerities తో అనుబంధం కలిగివుంది. ఈ విశ్వవిద్యాలయాల ద్వారా అభ్యర్థులు ఉన్నత విద్యను పొందవచ్చు. వీటి కొరకు ఆర్థికంగా కూడా సహకారాన్నిహెచ్ సిఎల్ అందింస్తుందన్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరెన్ని వివరాలు కోసం 96663 22032, 96525 03799 వీరిని సంప్రదించవచ్చన్నారు.
Registration Link :- https://tinyurl.com/Apssdc-EluruHcltechbee
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in