Job Drive:ఏలూరు, ఆగస్టు, 9 జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయము (నేషనల్ కెరీర్ సర్వీస్) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, సెట్ వెల్, ఏలూరు వారి సంయుక్త ఆధ్వర్యములో ది. 13.08.2024 తేదిన ఉదయం 10.00 గం. కు సెట్ వెల్ కార్యాలయము, కలక్టరేట్ కాంపౌండ్, ఏలూరు నందు జాబ్ మేళా నిర్వహించబడునని జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభుషనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాకు ఇంటర్వ్యూలు నిర్వహించుటకు ఈ దిగువ తెల్పిన కంపెని ప్రతినిధులు హాజరుకానున్నారు.
అమేజన్ (కెఎల్ గ్రూప్)
ఉద్యోగము & ఖాళీలు పొన్నేరి.దగ్గర,
తడ.సమీపంలో (ఎపి- టిఎన్ బోర్డర్) జీతం విద్యార్హతలు & వయస్సు
వేర్ హౌస్ అసోసియేట్స్ 18000
పిఎఫ్+ఇఎస్ఐ, ఇన్సూరెన్స్ కలదు పదవ తరగతి/ ఆ పైన
18-35 వయస్సు
విభిన్న ప్రతిభావంతులు (మూగ/చెవిటి) సైన్ లాంగ్వేజ్ వచ్చిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
కావాల్సిన డాకుమెంట్స్: రెస్యూమ్, ఆధార్ కాపీ, బ్యాంకు అకౌంట్ సమాచారం, విద్య అర్హత
కాపీలు, 4 పాస్పోర్ట్ సైజు ఫొటోస్.
యువతకు ప్రభుత్వము కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరముల కొరకు నెంబర్ 8886882032 ను సంప్రదించవలసినదిగా జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభుషనరావు తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in