Joint Collector Eluru:ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి. ధాత్రిరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. స్ధానిక కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు ఇన్ ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి యం. ముక్కంటి, ఏలూరు, నూజివీడు రెవిన్యూ డివిజనల్ అధికారులు ఎన్ఎస్ కె ఖాజావలి, వై. భవానీశంకరి, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా అభివృద్ధి , సంక్షేమ పధకాలు, జిల్లాలో కొనసాగుతున్న కార్యక్రమాలు కొనసాగించుటకు తనవంతు కృషిచేస్తానని తెలిపారు. జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ధాత్రిరెడ్డి కు జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, ఏలూరు తహశీల్దారు మురార్జీ, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in