Kaikaluru July 21: భారీ వర్షాలు, వరదలు వల్ల కైకలూరు నియోజకవర్గంలో వున్న కొల్లేరు సరస్సులో వరదనీరు కలవడం వల్ల వరద నీరు ప్రవహించే కొల్లేరులంక, పెంచికల మర్రు, కొల్లేటికోట, వడ్లకిట్టితిప్ప, ఆలపాడు తదితర గ్రామాల్లోని వరద నీరు ప్రవహించే కాలువలను ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆర్డివో క్షేత్రస్ధాయి సిబ్బందితో మాట్లాడుతూ తమ్మిలేరు వరదనీరు విడుదల కావడంవల్ల ఆ కాల్వగుండా వెళ్లే గ్రామాలను క్షేత్రస్ధాయి అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వరదనీరు వరదనీరుకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ వంటి అతిముఖ్యమైన అంశాలపై సిబ్బంది దృష్టిసారించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆర్డిఓ వెంట స్ధానిక తహశీల్దారు, రెవిన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in