Kolleru:ఏలూరు/మండవల్లి,సెప్టెంబర్ 8…వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేయడంతో పాటు అన్ని విధాల వారికి అండగా ఉంటామని ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి చెప్పారు. జిల్లా కలెక్టర్ వారీ ఆదేశాల మేరకు వరద బాధితులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మండవల్లి మండలంలో వరద ముంపుకు గురైన నూచుమిల్లి తదితర ప్రాంతాలను ఆదివారం ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి సందర్శించారు. ప్రజలను అప్రమత్తం చేసి గ్రామాలకు బోటు ఏర్పాటు చేసి రోడ్డు సౌకర్యం లేని చోట వరద ప్రభావిత ప్రాంతాలకు తాగునీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్థానిక గ్రామస్తులతో వరద పరిస్థితి పై మాట్లాడారు. కొల్లేరు ప్రభావిత మండలాల్లోని తహశీల్దార్లు,ఇతర అధికారులను ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేస్తూ సహాయ పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.రేషన్ కూడా అందించేందుకు చర్యలు తీసుకున్నమన్నారు.పలు చోట్ల పశు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెదఎడ్లగాడివద్ద వరద పరిస్ధితిని ఆర్డివో పరిశీలించారు.
వీరి వెంట స్థానిక తహసీల్దార్,తదితరులు ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in