Kukunoor: జులై, 8 : కుక్కునూరు మండల ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు.

కుక్కునూరు మండలం ఇబ్రహీంపేటలో సోమవారం పర్యటించి ప్రజల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రి సెల్వి కి స్థానిక ప్రజలు తమ సమస్యలను తెలియజేసుకున్నారు. కుక్కునూరు మండలంలోని గోదావరి నది గట్టుకు ఆనుకుని ఉన్న ప్రజలకు ప్రాజెక్ట్ నష్టపరిహారం అందలేదని స్థానిక ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముంపు మండలాల్లోని కొంత మంది ప్రజలకు సర్వే లో నమోదు చేయని కారణంగా పోలవరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ నష్టపరిహారం అందలేదన్నారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజ్ అందించిన తరువాత మాత్రమే కాలనీలకు తరలించాలి నిర్వాసితులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేవని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. నిర్వాసితులకు భూమికి భూమి పరిహారం సక్రమంగా అందలేనిదన్నారు. పెద్దరాయిగూడెం లోని ఉన్నత పాఠశాలలో, బోరప్పాడు లోని పాఠశాలలో టాయిలెట్లు లేవని, ఉప్పెనపల్లి గ్రామంలోని పాఠశాలలో టాయిలెట్లు, త్రాగునీరు లేవని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యా శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. పీసా చట్టం ప్రకారం మండలం ఎటువంటి సమావేశం నిర్వహించలేదని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర విభజన సమయంలో తమ గ్రామంలో 3 ఫెజ్ విద్యుత్ కనెక్షన్ తొలగించారని, తమ పొలాలకు విద్యుత్ కనెక్షన్ లేక ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ ను స్థానిక రైతులు కోరగా వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు అందించిన ప్రతీ సమస్యపై పరిష్కార చర్యలను ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో సమస్యలు పరిష్కారమయ్యేలా పర్యవేక్షించి, అనంతరం తనకు సవివరమైన నివేదిక అందించాలని మండల తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓ కె. అద్దయ్య, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, ఉప రవాణా కమీషనర్ శాంతకుమారి, ఆర్టీఓ శ్రీహరి, గనుల శాఖ ఏడి జి. సునీల్ బాబు, తహసీల్దార్, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in