Kukunoor:గోదావరి వరద నేపద్యంలో వరద ప్రభావిత బాధితులకు ఎటువంటి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డ్వామా పిడి, మండల ప్రత్యేక అధికారి ఎ. రాము చెప్పారు.
గోదావరి వరద మూడవ హెచ్చరిక జారీ అయిన పక్షంలో ఆయా గ్రామస్ధులను ముందుగా అప్రమత్తం చేసే దిశగా మంగళవారం స్పెషల్ ఆఫీసరు ఎ. రాము ఆధ్వర్యంలో ఎపిఐఐసి జోనల్ మేనేజరు కె. బాబ్జి, తహశీల్దారు డి. అచ్యుతకుమారి, యంపిడివో పి. నరసింహరావు బృందం ఆయా గ్రామాల్లో పర్యటించింది. కుక్కునూరు ఎ బ్లాక్, దాచారం పంచాయితీ బెస్తగూడెం, ఆంబోతులగూడెం, అమరవరం, చెరువుగొమ్ముగూడెం, ఎలకలగూడెం, కోమట్లగూడెం, ముత్యాలంపాడు, కివ్వాక, మర్రిపాడు ఆర్ అండ్ ఆర్ కాలనీలను సందర్శించారు. ఈ సందర్బంగా ప్రత్యేక అధికారి, డ్వామా పిడి ఎ. రాము మాట్లాడుతూ గోదావరి వరద మూడవ హెచ్చరిక సమయంలో మండలంలోని 10 నివాసిత ప్రాంతాలపై ప్రభావం వుంటుందని ఈ దృష్ట్యా ఆయా గ్రామస్ధులను పునరావాస కేంద్రానికి వచ్చేలా అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో పర్యటించడం జరిగిందన్నారు. గోదావరి ఆయా వరద హెచ్చరికలను కనుగుణంగా ఆయా నివాసిత ప్రాంతాల్లో చేపట్టవలసిన పునరావాస సహాయ కార్యక్రమాలకు ప్రతి నివాసిత ప్రాంతానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వ ప్రత్యేక అధికారులను నియమించడం మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. ఈ గ్రామస్ధాయి అధికారులు ఆయా గ్రామ ప్రజలు, పెద్దలు, ప్రజా ప్రతినిధులను సమన్వయంచేసుకొని పునరావాస కేంద్రాలకు తరలింపు, వసతుల కల్పనకు ఎంతో దోహదపడిందన్నారు. దాచారం ఆర్ అండ్ ఆర్ పునరావాస కేంద్రంలో 10 బయోటాయలెట్లను ఏర్పాటు చేశామన్నారు. కాలనీల్లో 60 నుంచి 70 వరకు వీధి దీపాలను వేయడం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లా యంత్రాంగం మంచినీటి సమస్యపై ముందుచూపుతో చేసిన కార్యక్రమాల వలన నీటి సమస్య తలెత్తలేదన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in