Kukunoor July 21: భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి వరద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయినవెంటనే వేలేరుపాడు మండలంలోని వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి జిల్లా కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివకుమార్ లతో కలిసి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుందని, వరద నీటిమట్టం పెరుగుతున్న స్థాయిని అనుసరించి ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయము చేసుకుని మిగిలిన ప్రాంతాలలో కూడా వరద కారణంగా ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వరద సహాయక కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. కుక్కునూరు మండలంలోని గొమ్ముగూడెం, లచ్చిగూడెం గ్రామాలకు కల్వర్టులు మునిగి రవాణా వ్యవస్థ స్తంభిస్తుందని, గొమ్ముగూడెం లోని 250 కుటుంబాలను దారాచారంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీకి, లచ్చిగూడెం గ్రామంలోని 47 కుటుంబాలను కొండపై ఉన్న ప్రాంతంలో వరద ఉధ్రితి తగ్గేవరకు తాత్కాలిక వసతి కల్పించాలన్నారు. వారికి మూడు రోజులకు సరిపోయే విధంగా బియ్యం, అరకేజీ కందిపప్పు, అరకేజీ వంటనూనె, వాటర్ ప్యాకెట్లు, 5 రకాల కూరగాయలు ప్రతీ కుటుంబానికి అందించాలన్నారు. అదేవిధంగా ఇటీవల పెదవాగు వరద కారణంగా దెబ్బతిన్న వేలేరుపాడు మండలంలోని దెబ్బతిన్న గ్రామాల ప్రజలకు ఆహరం, త్రాగునీరు పూర్తిస్థాయిలో అందించాలన్నారు. వేలేరుపాడు మండలం అల్లూరినగర్ లో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 15 టార్పాలిన్లు అందించడం జరిగిందని, మిగిలిన గ్రామంలో కూడా ఇళ్ళు దెబ్బతిన్న కుటుంబాలకు టార్పాలిన్లు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వరద సహాయక కార్యక్రమాలలో ఎక్కడా ఏ విధమైన ఫిర్యాదులకు తావులేకుండా బాధితులను ఆదుకునేలా అధికారులు పనిచేయాలన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in