Read Time:1 Minute, 26 Second
Kukunoor July 22:గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో మెరుగైన వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయటం జరిగిందని జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు.

దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలోని పునరావాస కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించారు. వైద్య శిబిరంలో అందిస్తున్న సేవలను ఆరా తీస్తూ అక్కడ ఉన్న మందులను పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారికి ఎటువంటి ఆనారోగ్య సమస్యలు లేకుండా చూడాలని వైద్యులకు సూచించారు. ఏమైనా అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి అంబులెన్స్ లో సమీప పిహెచ్ సి లేదా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లాని సూచించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in