Kukunoor July 22: భారీ వర్షాలు వరదల కారణంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాల ప్రకారం కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో 28 మంది గర్భిణీలు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో, సమీప పిహెచ్ సిలో చేర్పించారు.
ఈ నేపద్యంలో ఈనెల 21వ తేదీన కుక్కునూరు మండలం చీపురుగూడెంకు చెందిన సోదేం అనిత పుల్లపగూడెంకు చెందిన బి .అరుణ, ఈనెల 22వ తేదీన చీపురుగూడెంకు చెందిన మడకం దేవమ్మ పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలను గుర్తించి వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించడంలో జిల్లా యంత్రాంగం తీసుకొన్న చర్యలపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చొరవ మూలంగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న గర్భిణీలలో నెలలు నిండిన మహిళలను ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సుఖప్రసవాలు పొందారు. కష్టకాలంలో కొండంత అండగా నిలిచిన ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి ఆయా కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in