Leafy Vegetables:ఆకుకూరలు మనకు ఏ విధంగా లాభాన్ని ఇస్తాయో తెలుసుకుందాంబచ్చలి కూర: శరీరంలో వేడి తగ్గుతుంది. ఎండాకాలంలో మంచిది.
తోటకూర: ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ నుండి కాపాడుతుంది. అనేక పోషకాలు లభిస్తాయి.
గోంగూర: గుండెకు బలం చేకూరిస్తుంది. దంత సమస్యలు, కడుపులో పురుగులు వంటి ఇబ్బందులను తగ్గిస్తుంది.
పుదీనా: రక్తం శుద్ధి చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నేరుగా నమిలి తినవచ్చు. దీనివల్ల నోటి సమస్యలు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
మెంతికూర: మూత్రాశయంలో రాళ్లు కరుగుతాయి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
పొన్నగంటి కూర: కంటి చూపును మెరుగుపరుస్తుంది.చలువ కూడా చేస్తుంది.
కొత్తిమీర: ఆస్తమాతో బాధపడే వారికి కొత్తిమీర ఎంతగానో మేలు చేస్తుంది. జీర్ణ సమస్యలు కూడా ఉండవు.
చుక్కకూర: చుక్కకూరను వారానికి రెండు లేదా మూడు సార్లు ఆహారంలో తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
జీర్ణ వ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది. గ్యాస్ ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. చుక్కకూర ఆకుల రసం ఒక కప్పు తీసుకొని కొద్దిగా పాలు లేదా పెరుగు కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in