lighten dark elbows:కళ్ళ కింద ,మోకాళ్ళ, మోచేతుల నలుపు దూరం సాధారణంగా మనలో చాలామందికి కొన్నిసార్లు మోకాల మోచేతుల వద్ద నల్లగా మారుతుంటుంది.
దీంతో నలుగురిలోకి వెళ్లేటప్పుడు ఆయా భాగాలు కనపడకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమందికి ఎన్ని జాగ్రత్తలు పాటించిన నల్లటి వలయాలు బాధిస్తుంటాయి.
ఈ సమస్యకు సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. అవి ఎలాగో తెలుసుకుందాం.
చిట్కాలు టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాల్లో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి. ఆరిన తరువాత కడిగేయాలి. రోజు ఈ విధంగా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.
రోజ్ వాటర్ లో దూది ఉండను ముంచి నలుపు ఉన్నచోట రాయాలి.
అలాగే సెనగపిండిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ పోసి పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజు చేయాలి.
అవకాడో పండును గుజ్జు చేయాలి.
ఈ గుజ్జును కళ్ళ కింద ముఖమంతా రాసి ఆరిన తరువాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణం చర్మం పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది.
ఒక ఆలుగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
వాటిని నేరుగా మోచేతులు, మోకాళ్ళపై రుద్దవచ్చు .లేదా వాటి రసం తీసి ఆ భాగాలకు రాయాలి. తర్వాత 30 నిమిషాలు ఆగి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజులపాటు చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది.
ఒక టీ స్పూన్ బొప్పాయి రసం అంతే మొత్తంలో తేనే తీసుకొని బాగా కలిపి మిశ్రమం గా చేయాలి. దీని రాస్తుంటే మోచేతులు, మోకాళ్ళపై ఉండే నలుపుతనం పోతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in