Loans:ఏలూరు,మార్చి,10: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాధి మందికి ఒకేరోజు కోట్లాది రూపాయల రుణాలు ఇప్పించి మహిళల జీవనోపాధికి సాధికారతకు గౌ. ముఖ్యమంత్రి నారా చంద్రభాబునాయుడు బాటలు వేశారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ లింకేజి కింద రూ. 1.43 లక్షల మంది మహిళలకు రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు మొత్తం రూ. 1876 కోట్లు రుణాలు అందించారన్నారు. స్త్రీ నిధి కింద మరో లక్ష మంది మహిళలకు రూ. లక్ష రూపాయల చొప్పున వెయ్యి కోట్ల రూపాయలు అందించారన్నారు. పిఎం విశ్వకర్మ కింద వెయ్యి మందికి చేతివృత్తుల కోసం లక్ష రూపాయల చొప్పున 10 కోట్ల రూపాయలు అందించారన్నారు. చేయూత కింద 7,471 పట్టణ మహిళలకు రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు మొత్తం రూ. 645.52 కోట్లు అందించారన్నారు.

ఏలూరు జిల్లాలోరూ.131.82 కోట్ల రుణాలను అందించడం జరిగిందన్నారు. బ్యాంక్ లింకేజి కింద మహిళా సంఘాలకు రూ. 106.12 కోట్లు, పిఎంఎజెఎవై పధకం కింద రూ. 1.53 కోట్లు, పిఎంఎఫ్ఎంఎప్-పిఎంఇజిపి కింద రూ. 1.49 కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో 181 మహిళా సంఘాలకు రూ. 17.43 కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో నూతనంగా వ్యాపారం ప్రారంభించుకున్న 350 మంది మహిళలకు రూ. 5.25 కోట్లు అందజేశారన్నారు. మహిళలకు ప్రత్యేకించి బి.సి. కార్పోరేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ నందు ఉచిత శిక్షణతోపాటు జీవనోపాధికొరకు 4589 మంది మహిళలకు రూ. 11.47 కోట్ల విలువైన కుట్టుమిషన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఒకేరోజు మహిళా సంక్షేమానికి లక్షలాది మహిళలకు రుణాలు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in