Meekosam: ప్రకటన మీకోసం అర్జీల పరిష్కారంపై అధికారులు సవివరమైన వివరణ ఇవ్వాలి:
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) కార్యక్రమం ద్వారా 164 అర్జీలు స్వీకరణ..
అర్జీలు నాణ్యమైన పరిష్కారానికే ప్రాధాన్యత…జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, జూలై, 1 ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) అర్జీలు పరిష్కారంపై సవివరమైన వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) జిల్లాస్ధాయి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్ఓ డి. పుష్పమణి, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ భాస్కరరావు లతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం 164 అర్జీలు స్వీకరించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్బంగా జిల్లా అధికారుల నుద్ధేశించి కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను క్షుణంగా పరిశీలించి తదుపరి పరిష్కరించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలతో అర్జీలను పరిష్కరిస్తేనే అర్జీదారునికి మేలు జరుగుతుందన్నారు. అర్జీలు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమాచారం ఇవ్వవలసివుంటుందని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలో పరిష్కరించడానికి అధికారులు కృషిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో రెవిన్యూ, పౌర సరఫరాలు, రీసర్వే, పోలీస్, భూ వివాదాలు, విద్యా, పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్, తదితర సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరిగింది.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ ఎపి సేవాసర్వీసులో ఏమైనా పెండింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని పరిశీలించుకొని పంపిణీ చేయాలన్నారు.
అందిన అర్జీలలో కొన్ని…
పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన మల్లేశ్వరి తమ స్ధలం ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకొని మా స్ధలం మాకు అప్పగించి తమ స్ధలానికి నడకదారి ఇప్పంచాలని కోరుతూ అర్జీ అందజేశారు. నిడమర్రు మండలం సూరయ్యగూడెంకు చెందిన లక్ష్మి, స్ధలాన్ని ఆక్రమించుకొని పశువుల పాకలు ఏర్పాటుచేసి తన ఇంటికి వెళ్లే దారిమార్గం లేకుండా చేసిన వారిపై చర్యలు తీసుకొని ఇంటికి దారిమార్గంను చూపించమని అర్జీ అందజేశారు. చింతలపూడి మండలం ప్రగడవరం కు చెందిన పద్మావతి తమకు సంపూర్ణ గృహహక్కు పధకం ఇప్పంచవలసిందిగా కోరుతూ అర్జీ అందజేశారు. ముదినేపల్లి మండలం వణుదురు కు చెందిన దానయ్య తూర్పుదిశగావున్న పొలాలు గల పట్టాదారు కాల్వగట్టుకు సంబంధించిన పంటబోది దారిని తవ్వుకొని ఇక్కడ నివశించడానికి వీలులేదని ఇబ్బుదులకు గురిచేస్తున్నారని కావున తమకు న్యాయం చేయుమని అర్జీ అందజేశారు.
కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in