Meekosam:భీమవరం: జూలై 1,2024 ప్రజా ఫిర్యాదులకు సత్వరమే పూర్తి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సి. నాగరాణి అన్నారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నాగరాణి పాల్గొని ప్రజల నుండి విజ్ఞాపనలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం ఉండాలన్నారు. వచ్చిన ఫిర్యాదు తిరిగి మళ్లీ రావడం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు తెలిపారు. పరిష్కారం నాణ్యమైనదిగా పరిపూర్ణంగా ఉండాలని అన్నారు. సుదూర ప్రాంతాల నుండి మన మీద ఎంత నమ్మకంతో ఫిర్యాదులను తీసుకురావడం జరుగుతుందని, వారి నమ్మకం ఏ మాత్రం సడలని విధంగా ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపాలని కలెక్టర్ ఉన్నారు. ఈరోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా 107 ఫిర్యాదులను అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈరోజు పీజిఆర్ఎస్ ద్వారా అందిన కొన్ని ఫిర్యాదులు ఎలా ఉన్నాయి…
పోతుమూడి చిన్నారి ఫిర్యాదు చేస్తూ నేను కువైట్ లో ఉంటున్నానీ, అక్కడ నుండి నా పిల్లల పోషణ, చదువు నిమిత్తం చాలా డబ్బును నా భర్త పోతుమూడి రామారావుకు పంపడం జరిగిందని, డబ్బు వృధా చేసే పిల్లలను సరిగ్గా చూడడం లేదని, భర్తపై తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
భీమవరం నివాసి నక్క భావన ఫిర్యాదు చేస్తూ నా తండ్రి గారి ఉమ్మడి ఆస్తి 2.24 సెంట్లు భూమి నా అన్నయ్య ఒక్కరే అనుభవిస్తున్న వారిని, నా వాటాగా రావలసిన భూమిని ఇప్పించుటకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.
అత్తిలి మండలం తిరుపతిపురం శివారు గ్రామస్తులు ఫిర్యాదు చేస్తూ మా గ్రామంలోని రావూరి మహంకాళమ్మ, నిల్లా దాన అను వారుతప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారని, వారి సర్టిఫికెట్లను పరిశీలించి దివ్యాంగుల పెన్షన్ రద్దు చేయవలసిందిగా కోరడం జరిగింది.
కొల్లి భాస్కరరావు ఫిర్యాదు చేస్తూ నా తమ్ముడు, మరదలు 2021 సంవత్సరంలో ఉరి వేసుకుని చనిపోయారని, పొరుగు వారు వేధింపుల కారణంగా జరిగిందని, అట్రాసిటీ కేసు లో ఎఫ్ఐఆర్ స్టేజి నుండి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది.
వీరవాసరం మండలం కొణితివాడ నివాసి చింతపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు చేస్తూ నడుపూరు సెంటర్ లో ఆక్రమం తొలగించాలని కోరారు. దీనివలన వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదుల పేర్కొన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి కే సిహెచ్ అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in