Menopause symptoms:మెనోపాజ్ కు ముందు శారీరకంగా మానసికంగా మెనోపాజ్ పలు మార్పులను తీసుకొస్తుంది.
దీని నుండి ఉపశమనం పొందాలంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం.
ఋతుక్రమం ఆగే ముందు నుంచే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది లేదంటే మధుమేహం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
శరీరానికి తగినంత నీటిని అందించాలి లేకపోతే చర్మం పాడవడం, శరీరమంతా ఉబ్బరంగా మారటం, అధిక బరువు వంటి వాటికి ఆస్కారం ఉంటుంది.
రోజు ఆరేడు లీటర్ల నీటిని తాగడం మానకూడదు. అప్పుడే చర్మం తేమగా మారుతుంది. ముఖంపై ముడతలు, చర్మం పాడవడం వంటి సమస్యలను ముందుగానే నివారించవచ్చు. రోజుకి 7 గంటల నిద్ర జీవక్రియలను సక్రమంగా జరిగేలా చేస్తుంది.
హార్మోన్లు
ఈ దశలో జరిగే హార్మోన్ల మార్పును సమతుల్యం చేయాలంటే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఆహారానికి పెద్ద పేట వెయ్యాలి.
తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటే మంచిది, నిత్యం అరగంట వ్యాయామం చేయాలి, నడక చిన్న చిన్న వ్యాయామాలు, కండరాలను బలోపేతం చేస్తాయి, యోగా ధ్యానం వంటివి ఇక రోగాన్ని పెంపొందిస్తాయి, ఆందోళన వంటి వాటికి దూరంగా ఉండాలి, మెనోపాజ్ సమయంలో కావలసినంత కాల్షియం శరీరానికి అందదు.
ఎముకలు బలహీన పడతాయి. కాల్షియం తో విటమిన్ డి వంటి వాటిని సప్లమెంటరీ రూపంలో తీసుకుంటే దీన్ని సమతుల్యం చేయొచ్చు.
చక్కెర స్థాయిలో జరిగే హెచ్చుతగ్గులు తీవ్ర కుంగుపాటుకు దారితీస్తాయి. దీన్ని నిరోధించాలంటే చక్కెరను తగ్గించాలి. ప్రోసెస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
చురుకుగా
మెనోపాజ్ వచ్చిన తరువాత కొంగుబాటు వచ్చే అవకాశం ఉంది. బాధ్యతలు తీరుతున్న ఈ సమయంలో నచ్చిన అభిరుచికి ప్రాధాన్యం ఇస్తే ఇందులోంచి బయటపడొచ్చు. తోట పని, కుట్టు పని లేదా చిరు వ్యాపారం వంటివన్నీ మెదడును ఉత్తేజపరిస్తాయి. మనసు ఉల్లాసంగా మారుతుంది.
50 ఏళ్లు దాటిన తరువాత కెరియర్ లో అడుగు పెట్టిన మహిళల గురించి తెలుసుకొని వారి సలహాలు పాటించి ముందడుగు వేస్తే మెనోపాజ్ ప్రభావం నుంచి దూరం గా ఉండొచ్చు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in