Mumps Virus:గవద బిళ్ళలుఎండాకాలంలో ఎక్కువగా పిల్లలో కనిపించే మరో సమస్య గవద బిళ్ళలు. గొంతు క్రింద వాపులా మొదలై గవదబిళ్ళలు పిల్లల్ని చాలా బాధపడేలాగా చేస్తుంది. అంతేకాదు దీనివల్ల పిల్లలకు అధిక టెంపరేచర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయకుండా తొలి దశలోనే గుర్తించి సరైన ట్రీట్మెంట్ చేయించాలి.
అసలు ఈ గవదబిళ్ళలు ఎలా వస్తాయి ,ఎంత కాలం ఉంటాయి ,వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ఇప్పుడు తెలుసుకుందాం చిన్న పిల్లల్లో వచ్చే వ్యాధుల్లో గవదబిళ్ళలు ఒకటి. పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల Mumps వైరస్ చిన్న పిల్లలో త్వరగా ఎటాక్ అవుతుంది .
చాలా మంది తల్లిదండ్రులు ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించలేరు. పిల్లల్లో జ్వరం వచ్చిన, నలతగా అనిపించినా, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్న గవదబిళ్ళలు వచ్చాయని గుర్తించాలి.
అంతేకాదు mumps వైరస్ ఎవ్వరికి అయితే ఉంటుందో ఆ పిల్లలతో కలవనీయకూడదు.
అని నిపుణులు చెబుతున్నారు.
గవదబిళ్ళలు అనేది అంటూ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుంది .స్కూలుకి, ఆడుకోవడానికి, పక్కింటికి ఆడుకోవడానికి వెళ్ళిన గానీ ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తుంది.
అలాగే గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది .ఈ వైరస్ ఎక్కడైతే లాలాజలం గ్రంధులు ఉంటాయో చంపకు ,దవడ కింద ఈ నాలుగు గ్రంధులు వాచి నోరు తెరవలేకపోవడం ,మింగలేకపోవడం, ఆహారం తీసుకోవడం కూడా కష్టమై వారం నుండి పది రోజుల వరకు నొప్పితో బాధపడుతూ ఉండే అవకాశం ఉంటుంది.
అలా వచ్చినప్పుడు ఒకసారి లాలాజలం గ్రంధులే కాదు, బ్యాక్టీరియా అటాక్ చేస్తుంది.
ఇంకొకసారి మెదడు వాపు జబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.అలాంటప్పుడు డాక్టర్ సలహా తీసుకోండి. సరైన నీరు ,ఆహారం, పండ్ల రసాలు తీసుకుంటూ ఉంటే త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.
చిన్నపిల్లలకు గవదబిళ్ళలు సంబంధించి టీకాలు ఉన్నాయి.
ఈ వైరస్ రాకుండా MMR అనే వ్యాక్సిన్ చిన్నపిల్లల వైద్యుల సమైక్యం MMR ఇండియన్ అకాడమీ రికమండేషన్ ప్రకారము MMR వ్యాక్సిన్ పిల్లలకు 9 నెలలకు ఒకసారి ,15 నెలలకు ఒకసారి, నాలుగు సంవత్సరాలు నిండిన పిల్లలకు ఈ వ్యాక్సిన్ అనేది వేయడం వల్ల పిల్లలు ఈ వైరస్ బారిన పడకుండా ఉంటారు.
అలాగే ఇంట్లోనే ఆయుర్వేదంలో కూడా ఒక చిన్న చిట్కాతో కూడా గవదబిళ్ళను తగ్గించవచ్చు.
రెండు స్పూన్ల మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం మిక్సీ పట్టి పేస్టును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పావు స్పూన్ పసుపు, కిల్లిలకు ఉపయోగించే సున్నం చిటికెడు.
చిటికెడు అంటే చిటికెడు మాత్రమే మూడింటిని బాగా కలిపి గవదబిళ్ళలు ఉన్న చోట లేపనంగా రాయండి. ఈ గవదబిళ్ళల బాధ తగ్గుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in