Murukulu:నూనె పీల్చని జొన్న మురుకులు మురుకులు ఎంతో మంది ఎన్నో రకాలుగా చేస్తారు. బియ్యం పిండి, మినప పిండి, పెసర పిండి ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి.
వీటితో మురుకులు బాగుంటాయి. జొన్న పిండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈరోజు జొన్న పిండితో జొన్న మురుకులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
జొన్న పిండిలో నువ్వులు, వేరుశెనగపిండి, వాము, పచ్చిమిర్చి ముద్ద ,ఉప్పు, రెండు చెంచాల వెన్న వేసుకొని నీళ్లతో పిండి కలిపి కాగుతున్న నూనెలో మురుకులు ఒత్తుకోవాలి. ఇవి రుచిగాను ఉంటాయి.
నూనె కూడా ఎక్కువ పీల్చవు. మూడు కప్పుల జొన్న పిండికి, అరకప్పు నువ్వులు, ఒక కప్పు వేరుశనగ గుళ్ళు, ఒక టేబుల్ స్పూన్ వాము, మూడు పచ్చిమిర్చి అవసరం అవుతాయి.
వేరుశనగ గుళ్లను వేయించి పొట్టు తీసి గ్రైండ్ చేయాలి. పిల్లలు చిప్స్ లాంటి స్నాక్స్ తింటే వాటిలో ఉండే ప్రెజర్వేటర్స్ వల్ల జబ్బులు పాలవుతారు.
కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన మురుకులను చిరుతిండ్లు గా పెడితే ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారు. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వారికి ఇవి ఎంతో ఉపశమనం కలిగిస్తాయి. వీటిని పిల్లలు పెద్దలే కాదు.
వయసు పైబడిన వారు, ముసలి వాళ్లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దానితో ఈ జొన్న మురుకులను మళ్లీమళ్లీ చేస్తుంటారు. ఒక్కసారి జొన్న మురుకలను ఇలా చేసి చూడండి. మీకు తప్పక నచ్చుతాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in