Musunuru: ఆగష్టు, 1 : ప్రభుత్వ రెవిన్యూ కార్యాలయాలలో రికార్డుల పరిరక్షణకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు.
ముసునూరు తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డు గది, కార్యాలయ ఆవరణను గురువారం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, కార్యాలయ రికార్డుల భద్రతను పరిరక్షించేందుకు 24 గంటల పాటు సిబ్బందికి షిఫ్టుల వారీగా విధులు కేటాయించాలని ఆదేశించారు. అనంతరం ముసునూరు లోని రేషన్ షాప్ ను ఆకస్మిక తనిఖీ చేసి, రేషన్ పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జేసీ వెంట తహసీల్దార్ ఎమిలీ కుమారి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in