bhimavarambhimavaram
0 0
Read Time:5 Minute, 7 Second

Narasapuram: జూలై 08,2024. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమ‌లుకు ప‌టిష్ట చర్యలు చేపట్టాలి

చట్ట బద్ధమైన పన్నులు మరియు లెవీలతో పాటు కార్యకలాపాల ఖర్చు మాత్రమే వినియోగదారుల నుండి వసూలు చెయ్యాలి.

వినియోగదారులు సంతృప్తి చెందాలి, ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు.

జిల్లా జాయింటు కలెక్టరు సి.వి.ప్రవీణ్ ఆదిత్య….

సోమవారం నరసాపురం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో ప్రజలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నరసాపురం ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, సంబంధిత అధికారులు, బోట్స్ మెన్ సొసైటీలతో జిల్లా జాయింటు కలెక్టరు సి.వి ప్రవీణ్ ఆదిత్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ప్ర‌జా ప్ర‌యోజ‌నార్థం రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఉచిత ఇసుక విధానాన్ని ప‌టిష్టంగా అమ‌లుచేసేందుకు అధికారులు కృషిచేయాల‌న్నారు. నరసాపురం, అబ్బిరాజు పాలెం, దొడ్డిపట్ల, యలమంచిలి, చించినాడలో ఉన్న పాయింట్లులలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి అనుమతులు యుద్ధ ప్రాతిపదికన పొందాలన్నారు. కొత్తగా గోదావరిలో డీసిల్టింగ్ పాయింట్లను సంబంధిత అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించాలన్నారు. జిల్లాలోని వివిధ ఇసుక స్టాక్ పాయింట్ల‌లో నిల్వ‌లు, ఉచిత విధానం అమ‌లుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై చ‌ర్చించారు. జ‌వాబుదారీ త‌నంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమ‌లుచేయాల‌ని నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చట్టబద్ధమైన పన్నులు మరియు లెవీలతో పాటు కార్యకలాపాల ఖర్చు మాత్రమే వినియోగదారుల నుండి వసూలు చేయబడుతుందన్నారు. ఒక సొసైటీకి ఎన్ని బొట్లు ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది ఉంటారు, ఒక బోటు ద్వారా రోజుకి ఎంత ఇసుకను తీసుకురావచ్చును తదితర వివరాలను జిల్లా జాయింటు కలెక్టరు ఆరా తీశారు. ఇసుక నిల్వ కేంద్రాల వ‌ద్ద నామ‌మాత్ర‌పు రుసుం వివ‌రాల‌ను తప్పనిసరిగా ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుక విధానాన్ని మైన్స్ అండ్ జియాల‌జీ, రెవెన్యూ, ర‌వాణా, పోలీసు త‌దిత‌ర శాఖ‌ల అధికారులు ప‌టిష్ట అమ‌లుకు చెయ్యాలన్నారు. ఇందుకు ప్రణాళికాబద్ధంగా వ్య‌వ‌హ‌రించా ల‌న్నారు. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ స్టాక్ పాయింట్ వద్ద డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని పర్యవేక్షణకు ఉంచాలని, అనధికారికంగా ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింటు కలెక్టరు సి.వి.ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు.

బోట్ మేన్ సొసైటీలు కొన్ని ఇబ్బందులను జిల్లా జాయింటు కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు.

సమావేశంలో ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, జిల్లా గనులు, భూగర్భ శాఖాధికారి జి.జయ ప్రసాదు, కన్జర్వెన్సీ సహాయ సంచాలకులు కె.వి.సుబ్బారావు, నరసాపురం, పెనుగొండ ఆచంట, యలమంచిలి తహాశీల్దార్లు, సంబంధిత అధికారులు, బోట్స్ మెన్ సొసైటీలు, ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *