Read Time:2 Minute, 19 Second
Neem Leaves Benefits:ఔషధ విలువ గల వేపాకు
1.వేప చెక్క కరక్కాయల చూర్ణాన్ని గాని, వేప చెక్క ఉసిరికాయల చూర్ణాన్ని గాని ఆరు గ్రాముల మోతాదులో నెలరోజుల పాటు సేవిస్తే చర్మ వ్యాధులు నయమవుతాయి.
- వేపాకు కు సమానంగా మారేడు ఆకులను కలిపి మెత్తగా రుబ్బి తలకు పట్టించి 12 గంటల పాటు ఉంచాలి. ఈ విధంగా నెల రోజులు చేస్తే రాలిపోయిన తల వెంట్రుకల స్థానంలో తిరిగి కొత్త వెంట్రుకలు వస్తాయి.
3.వేప నూనెను తలకు పట్టించి గంట తర్వాత వేపాకు కషాయాన్ని తలకు మర్దన చేస్తే తలపై వచ్చే దురదలు, కురుపులు, పుండ్లు, చుండ్రు, పేలు రాకుండా ఉంటాయి.
4.వేప నూనెకు సమానంగా తేనె కలిపి దానిలో దూది ముంచి చెవిలో పెట్టుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది. - వేపాకులను నీడన ఎండబెట్టి, కాల్చి బూడిద చేయాలి. పది గ్రాముల బూడిదను ఒక గ్లాస్ నీటితో కలిపి సేవిస్తే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. వేప నూనెకు సమానంగా నీలగిరి తైలం కలిపి కీళ్ల మీద రోజుకు రెండు సార్లు మర్దన చేస్తే నరాల నొప్పులు తగ్గుతాయి.5. వేపాకు రసంలో ఒక స్పూన్ తేనె కలిపి సేవిస్తే కడుపులోని పలు రకాల క్రిములు నశిస్తాయి.
- 10 మిల్లీ మీటర్ల వేప పుల్లల కషాయంలో మూడు గ్రాముల త్రికటు చూర్ణం కలిపి రోజుకి రెండు పూటలా భోజనానికి అరగంట ముందు త్రాగుతూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in